Home రాజకీయాలు పవన్ కల్యాణ్ కుల రాజకీయం.. అందరికీ స్పష్టత!

పవన్ కల్యాణ్ కుల రాజకీయం.. అందరికీ స్పష్టత!

SHARE

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు కుల రాజకీయాలకు పితామహుడిగా చెప్పవచ్చు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై పట్టు బిగించే సమయానికి అన్ని పార్టీల్లోనూ అందరూ ఉండే వారు. తెలుగుదేశం పార్టీలో రెడ్లు కొందరు ముఖ్య పదవుల్లో ఉండేవాళ్లు. ఇక కాంగ్రెస్ పార్టీలో కమ్మ వాళ్లు గట్టిగా ఉండేవాళ్లు. ఓటర్లు కూడా తాము తము ఫలానా పార్టీనే అనే గట్టిగా కూర్చునే వారు కాదు. కులాల వారీగా వారి ఛాయిస్ ఉండేది కాదు. అయితే చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ధనమయం చేయడంతో పాటు కులమయం చేశాడనే పేరుంది.

చంద్రబాబు నాయుడు తన చేతిలో అధికారం ఉన్నంత సేపూ తన కులం వాళ్లనే కీలక వ్యవస్థల్లో పెట్టి వాళ్ల చేత తన పనులు చేయించుకోవడం మొదలుపెట్టాడని అంటారు. ఇప్పటికీ బాబు నాటిన కుల విత్తనాలు ఆయన మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతారంతా.

బాబు సంగతలా ఉంటే.. ఆయన కన్నా కుల రాజకీయాలు గట్టిగా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. పవన్ కుల రాజకీయం చాలానే కనిపిస్తోంది. తను కుల రాజకీయం చేయడానికి రాలేదంటూనే కుల రాజకీయం చేస్తున్నాడు పీకే. ఒకవైపు జగన్ కులాన్ని పవన్ ప్రస్తావిస్తున్నాడు.

ఇక పవన్ కల్యాణ్ రాజకీయంలో అడుగడుగునా కులం ప్రభావమే కనిపిస్తోంది. ఆయన తిరిగేదంతా గోదావరి జిల్లాల్లోనే. అక్కడ కాపులు ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఇలా కాపులు ఉన్న చోటేపవన్ తిరుగుతున్నాడు. దీన్ని కుల రాజకీయం అనకూడదా..ఇది కుల రాజకీయం కాదా!
ఇక పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ అనే అంశంలో కూడా చాలా నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి.

దేన్ని చూసినా.. అవంతా కాపుల జనాభా ఎక్కువగా ఉన్నవే. కాపులు లేని చోట పోటీకి పవన్ ముందుకు రావడం లేదు. అసలు ఆ ఆలోచనే లేదు. ఇదీ పవన్ కథ. మళ్లీ తను కుల రాజకీయం చేయడం లేదని పవన్ అంటాడు. ఇది జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం కాదా?