Home రాజకీయాలు ఓట్లు పడకనే.. ఒక సీట్లో ఓడిపోయిన టీడీపీ!

ఓట్లు పడకనే.. ఒక సీట్లో ఓడిపోయిన టీడీపీ!

SHARE

తెలంగాణలో తెలుగుదేశం ప్రస్తుత బలం మీద అందరికీ సందేహాలే ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ.. సీట్ల బేరం వద్ద టీడీపీ సత్తా బయటకు వచ్చింది. గట్టిగా సీట్లను అడిగి తీసుకోలేకపోయింది ఆ పార్టీ. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమికి పెద్ద మనిషిగా వ్యవహరించినా టీడీపీ సీట్లను డిమాండ్ చేయలేకపోయింది. ఈ విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎక్కువగా సీట్లను అడగవద్దని ఈ విషయంలో ఒత్తిడి చేయవద్దని తమ పార్టీ వాళ్లకు చెబుతూ వచ్చాడు.

చంద్రబాబు అప్పుడు ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది. నామినేషన్ల చివరి రోజున టీడీపీ తన కోటాలో వచ్చిన సీట్లన్నింటికీ అభ్యర్థులను నిలపలేకపోయింది. ఒక నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎవరికీ బీ ఫారం దక్కలేదు. దీంతో అక్కడ టీడీపీ పోటీ లేకుండా పోయింది.

కూటమిలో టీడీపీ అడిగిన సీట్లే తక్కువ. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో హ్యాపీగా ఫీలైంది. టీడీపీ తక్కువ సీట్లకు ఓకే అనడంతో ఆ పార్టీ అడిగినన్ని సీట్లను ఇచ్చింది. అయితే తీరా టీడీపీ ఒక సీట్లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని లేకుండా చేసుకుంది. తద్వారా.. కనీసం పోలింగ్ జరగకనే.. నామినేషన్ల ప్రక్రియ దశలోనే ఒక సీటును టీడీపీ కోల్పోయింది. మరి అసలు కథ ఎలా ఉంటుందో!