Home రాజకీయాలు పవన్.. బాబు ఏజెంటేనా, బలపడుతున్న అనుమానాలు!

పవన్.. బాబు ఏజెంటేనా, బలపడుతున్న అనుమానాలు!

SHARE

పవన్ కల్యాణ్ అందరికీ నీతులు చెబుతున్నాడు కానీ.. తను ఏ మేరకు నీతులు పాటిస్తున్నాడో చూసుకోడు. చూసుకున్నా.. తనకు మించిన నీతి పరుడు లేనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. పవన్ రాజకీయ నీతి ఏమిటో జనాలందరికీ తెలిసిందే. ముందుగా ప్రజారాజ్యం పార్టీ అంటూ రావడం.. అనుకున్న లెక్కలు నిజం కాకపోవడంతో దాన్ని విలీనం చేసి కొత్త పార్టీ రూపంలో వచ్చాడు పవన్. ఈ విషయంలో చిరంజీవే గాక పవన్ కు కూడా పాత్ర ఉందనేది బహిరంగ సత్యం.

అయితే తను, తన అన్నకు మించిన నీతిమంతులు లేరన్నట్టుగా పవన్ కలరింగ్ ఇస్తున్నాడు, డెబ్బై లక్షల మంది నమ్మ కాని అమ్ముకున్నది వీళ్లు కాదా. ఇదే పని మరొకరు చేసి ఉంటే వాళ్ల మీద పవన్ ఎలా విరుచుకుపడేవాడో చెప్పనక్కర్లేదు.

అయితే పవన్ నీతులు బయటకు వాళ్లకు మాత్రమే చెబుతాడు. తను మాత్రం నీతులు పాటించనక్కర్లేదు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే పవన్ వాళ్ల మీద పవన్ విరుచుకుపడతాడు. అడ్డగోలుగా మాట్లాడతాడు. ఏడుస్తాడు. ఇలా ఉంది పీకే రాజకీయం.

ఇక ఈ మధ్య జగన్ మీద పడ్డాడు పీకే. సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారు. నిలదీస్తారు అదేంటో చంద్రబాబు కన్నా జగన్ మీదే పవన్ తెగ విరుచుకుపడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుతో పవన్ దోస్తీ సాగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచారం చేస్తోంది. జగన్ తో పవన్ పొత్తు పెట్టుకుంటున్నాడని అంటోంది. ఇది టీడీపీ వ్యూహాత్మకంగా చెబుతున్న మాటే . జగన్ మీద పవన్ అడ్డగోలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు ఏజెంటే పవన్ అనే అభిప్రాయాలు బలపడుతున్న నేపథ్యంలో వాటిని డైవర్ట్ చేయడానికే టీడీపీ వ్యూహాత్మకంగా జగన్, పవన్ ల పొత్తు అంటూ మాట్లాడుతోంది. ఇదంతా టీడీపీ ప్లాన్ అని, పవన్ ను టీడీపీ ఇలా ఆడిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.