Home రాజకీయాలు తోక పత్రికకు బాబు చేసిన లబ్ధి రూ.ఏడు వందల కోట్లా!

తోక పత్రికకు బాబు చేసిన లబ్ధి రూ.ఏడు వందల కోట్లా!

SHARE

మాజీ సీఎస్ అజేయ కల్లం ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఒక మీడియా సంస్థకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయల మేర లబ్ధి కలిగించిందని ఆయన అంటున్నారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల చొప్పున సదరు మీడియా సంస్థకు చంద్రబాబు లబ్ధి కలిగించాడని ఈ మాజీ ఐఏఎస్ అధికారి అంటున్నారు.

అనేక మార్గాల్లో ఆ మీడియా సంస్థకు చంద్రబాబు నాయుడు లబ్ధి కలిగించాడని సమాచారం. అందులో ముఖ్యమైనది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రసార హక్కులు, అందుకు సంబంధించిన వ్యవహారాలు. కీలకమైన అసెంబ్లీ సమావేశాల ప్రసారం దగ్గర నుంచి అనేక వ్యవహారాలు తోక పత్రిక చేతిలోనే ఉన్నాయని అంటున్నారు.

ఇక రకరకాల వ్యాపారాల విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తోక పత్రిక యాజమానికి అనుచితమైన లబ్ధి కలిగించిందని సమాచారం. ఇక యథావిధిగా యాడ్స్.. ఇలా ఏ రకంగా చూసినా.. సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం నుంచి సదరు తోక పత్రిక యజమాని లబ్ధి పొందాడని.. ఇలా భారీగా వెనకేసుకున్నాడనే మాట వినిపిస్తోంది.

ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు భజన చేస్తూ వస్తున్నాడు ఆ యజమాని అనేది బహిరంగ సత్యమేనని అంటున్నారు.