Home రాజకీయాలు జగన్ సూటిగా..చంద్రబాబుకు ఆ ధైర్యముందా?

జగన్ సూటిగా..చంద్రబాబుకు ఆ ధైర్యముందా?

SHARE

తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సూటిగా స్పందించేశాడు. ఈ అంశంపై జగన్ ఎప్పుడు మాట్లాడతాడా అని చాలా మంది ఎదురుచూశారు. జగన్ తనపై జరిగిన హత్యాయత్నం గురించి మాట్లాడుతూ.. అది పక్కా చంద్రబాబు నాయుడి పనే అని వ్యాఖ్యానించాడు. బాబు కుటిల వ్యూహంతోనే తనపై హత్యాయత్నం జరిగిందని జగన్ వ్యాఖ్యానించాడు.

తనపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబు పాత్ర ఉందని, బాబు ఆదేశాల మేరకే తనపై హత్యాయత్నం జరిగిందని కూడా జగన్ వ్యాఖ్యానించాడు. అలాగే ఆపరేషన్ గరుడ విషయంలో కూడా జగన్ స్పందించాడు. దాని వెనుక కర్తాకర్మక్రియ చంద్రబాబే అని సూటిగా స్పష్టం చేశాడు జగన్ మోహన్ రెడ్డి.

ఇలా ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు తనపై జరిగిన హత్యాయత్నానికి కారకుడు ముఖ్యమంత్రే అని తేల్చి చెప్పాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తున్నాడో తెలుసా.. యథావిధంగా డొంకతిరుగుడు మాటలతో, ఎదురుదాడితో స్పందిస్తున్నాడు. జగన్ సూటిగా చెబుతున్నాడు. చంద్రబాబు మీదే ఆరోపణలు చేస్తున్నాడు. అయితే చంద్రబాబు మాత్రం అంత సూటిగా స్పందించడం లేదు.

జగన్ పై హత్యాయత్నానికి సంబంధించిన సాక్ష్యాధారాలను తన చేతికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నువ్వే ఆ పని చేయించావయ్యా అని జగన్ అంటుంటే.. చంద్రబాబు మాత్రం సాక్ష్యాలు తనకు ఇస్తే చర్యలు తీసుకుంటానని అంటున్నాడు.
ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది ఇది కాదు. జగన్ ఆరోపఫణలపై విచారణ జరిపించడం. జగన్ డైరెక్టుగా తన మీదే ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దీనిపై విచారణకు ఆదేశించాలి. అయితే ఆ విచారణ తన సొరుగులోని వ్యక్తులతో కాదు.. వైసీపీ కోరుతున్నట్టుగా విచారణ చేయించాలి. స్వతంత్ర కమిటీ చేత విచారణ జరిపించాలి. చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో తన పాత్ర లేదని ఆ విధంగా నిరూపించుకోవాలి. అయితే బాబు అందుకు మాత్రం ముందుకు రావడం లేదు!