Home రాజకీయాలు కూటమికి అక్కడ వచ్చిన లాభం ఇక్కడ పోతోందా!

కూటమికి అక్కడ వచ్చిన లాభం ఇక్కడ పోతోందా!

SHARE

తెలంగాణ రాజకీయం లో మహాకూటమి గా ఏర్పడిన పార్టీలు తామంతా జాయింటుగా ఏదో అద్భుతం చేసేస్తాం అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాయి. గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో అటుకాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీ కొంతమేర సీట్లు సంపాదించుకున్నాయి. అయితే అధికారానికి చాలా దూరంగా నిలిచాయని అనుకోండి.

కానీ.. తామిద్దరం కలిస్తే.. నాటి ఓట్లు కలుస్తాయని.. కేసీఆర్ పై ఎలాగూ ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి.. తాము గెలిచేయడం ఖాయమని ఈ పార్టీలు భావించాయి. అందుకే సీట్ల పేచీ లేకుండానే కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపాయి. ఇక ఈ పార్టీలకు టీజేఎస్, సీపీఐలు తోడు వచ్చాయి.

ఎట్టకేలకూ సీట్ల పందేరం ముగిసింది. రేపు నామినేషన్లకు తుది గడువు. ఇలాంటి నేపథ్యంలో కూటమి పరిస్థితి ఏమిటి అంటే.. భారీ ఎత్తున రెబల్స్ నామినేషన్స్ దాఖలు చేశారు. సోమవారం రోజున మరింతమంది నామినేషన్స్ వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ రెబెల్స్ రెండురకాలుగా తయారవుతున్నారు. ఒకటి ఒకే పార్టీలోని ఆశావహులు, మరో రకం రెండు పార్టీల్లోని ఆశావహులు. కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించగానే రెబల్స్ బయల్దేరారు. ఇలా కాంగ్రెస్ సీట్లలో కాంగ్రెస్ కే రెబట్స్ కనిపిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ టీడీపీకి, టీజేఎస్ కు ఇచ్చిన సీట్లలో కూడా ఇదే కథ. అక్కడ కూడా కాంగ్రెస్ రెబల్స్ రెచ్చిపోతున్నారు. అంతా నామినేషన్లతో ఢీ అంటున్నారు.

మరి కూటమిగా జట్టు కట్టి ఈ పార్టీలు బావుకునేది ఏమిటో కానీ..రెబల్స్ మాత్రం కూటమితో కూడిన బలానికి తమ తిరుగుబాట్లతో చెక్ పెడుతున్నట్టుగా ఉన్నారు.