Home రాజకీయాలు కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో టికెట్ల చిచ్చు స్టార్ట్స్!

కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో టికెట్ల చిచ్చు స్టార్ట్స్!

SHARE

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఇప్పుడు టికెట్ల చిచ్చు మొదలైందట. గత ఎన్నికల అనంతరం.. మొన్నటి వరకూ తెరమరుగు అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యనే మళ్లీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఏదో సాధిద్దామని మళ్లీ కిరణ్ వచ్చాడు. తను అసహ్యించుకుని వెళ్లిన కాంగ్రెస్ పార్టీలోనే చేరాడు.

ఇక కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉండటంతో కిరణ్ కు కొత్త ఆశలు మొదలయ్యాయి. రాజంపేటలో కిరణ్ రెడ్డి ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నాడట. టీడీపీతో కాంగ్రెస్ కు పొత్తు ఏర్పడితే పోటీకి కాస్త సానుకూలత ఏర్పడుతుందనేది కిరణ్ కుమార్ రెడ్డి ఆశ.

తను మాత్రమే కాదట.. తన తనయుడు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేది కిరణ్ కుమార్ రెడ్డి ఆశ అని సమాచారం. తనయుడిని తను గతంలో ప్రాతినిధ్యం వహించిన పీలేరు నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నాడట కిరణ్ రెడ్డి. ఇదీ కథ.

అయితే ఇప్పటికే ఆ సీటు విషయంలో కిరణ్ తమ్ముడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఆయన టీడీపీ తరపున అక్కడ పోటీ చేయాలని అనుకుంటున్నాడు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఏర్పడుతుంది కాబట్టి.. కిరణ్ తమ్ముడు లేదా కిరణ్ కొడుకు.. ఎవరో ఒకరికే సీఎం సీటు దక్కే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు రచ్చ మొదలైందని సమాచారం. ఈ వివాదంతో అన్నాదమ్ముల మధ్యన మాటలు కూడా లేకుండా పోయాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది!