Home రాజకీయాలు మహాకూటమిలో రెబల్స్ ..ఎన్ని నియోజకవర్గాల్లోనంటే!

మహాకూటమిలో రెబల్స్ ..ఎన్ని నియోజకవర్గాల్లోనంటే!

SHARE

నామినేషన్స్ కు ఇక ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇప్పటికీ మహాకూటమిలో సీట్ల పందేరం తేలడం లేదు. సోమవారం నామినేషన్ల ఘట్టానికి చివరి రోజు. ఆదివారం అయినా క్లారిటీ వస్తేనే.. కూటమి తరఫున అభ్యర్థులు నామినేషన్స్ వేయగలుగుతారు. లేకపోతే అంతే సంగతులు. చిత్తగించవలెను అనుకోవాల్సి ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫునే ఎనిమిది మంది అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఇక టీజేఎస్ తరఫు అభ్యర్థులు కూడా ఖరారు కావాల్సి ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ఈ కూటమి కథ రేపు క్లైమాక్స్ కు వస్తుంది. సోమవారం దాదాపుగా నామినేషన్స్ దాఖలు కావొచ్చు. అంత వరకూ ఓకే కానీ.. ఇప్పుడు కూటమికి రెబెల్ అభ్యర్థులు టెన్షన్ పెడుతున్నారు. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో! కూటమి రాజకీయంలో టికెట్ దక్కని ఆశావహులు చాలా మంది ఇప్పటికే నామినేషన్స్ దాఖలు చేశారు.

కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దురుముగ్గురు నేతలు టికెట్ ఆశించారు. వారిలో ఒకరికే అవకాశం దక్కింది. మిగిలిన వారు నిరాశ భరితులు అయ్యారు. లేట్ లేకుండా వారు నామినేషన్స్ దాఖలు చేసేశారు. మరి కొన్ని చోట్ల మహాకూటమి పుణ్యాన చాలా మందికి సీట్లు పోయాయి. కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగడం లేదు. తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ జనసమితికి, సీపీఐకి కొన్ని సీట్లను కేటాయించింది. అలాంటిసీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ ఆశావహులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

తాము కూటమికి సహకరించేది లేదని.. తమకు టికెట్ రాలేదు కాబట్టి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతున్నట్టుగా వారు ప్రకటించుకున్నారు. ఓవరాల్ గా.. కాంగ్రెస్ పార్టీకి, మహాకూటమికి ఇలాంటి వారి వల్ల నలభైకి పైగా నియోజకవర్గాల్లో రెబెల్స్ పోటు ఉంటుందని తెలుస్తోంది. అంటే మూడో వంతు సీట్లలో తిరుగుబాటు దార్లు కూడా రంగంలో ఉంటారనమాట.వాళ్లు ఓట్లను చీల్చే వాళ్లు కొందరైతే.. కాంగ్రెస్ ను ఓడించేస్తామని చెబుతున్నవాళ్లు మరి కొందరు!