Home రాజకీయాలు పవన్ కల్యాణ్.. అందుకే అలా మాట్లాడుతున్నాడా!

పవన్ కల్యాణ్.. అందుకే అలా మాట్లాడుతున్నాడా!

SHARE

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉన్నాడు.జగన్ విషయంలో అయితే పవన్ మరీ రెచ్చిపోతున్నాడు. జగన్ ను ఉద్దేశించి కులం ప్రస్తావన కూడా తెస్తున్నాడు. ఇలాంటి మాటలతో వార్తల్లో నిలవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే.. జగన్ ను ఏదో విధంగా రెచ్చగొట్టాలని పవన్ ప్రయత్నిస్తున్నాడని స్పష్టం అవుతోంది.

జగన్ ను ఇలా పదే పదే రెచ్చగొడితే.. ఆయన స్పందించకపోతాడా అని ఒక ఆశ. ఒకవేళ జగన్ స్పందించకపోయినా.. మీడియా వాళ్లు జగన్ వద్ద ఈ ప్రస్తావన తెస్తారు. అప్పుడు జగన్ ఏదో ఒకటి అంటాడు. దాన్ని పట్టుకుని.. రాజకీయం చేయొచ్చు అని పవన్ కల్యాణ్ ఆశ. ఏపీ రాజకీయంలో పవన్ కల్యాణ్ పరిస్థితి ఇది.

దీని ద్వారా పవన్ కల్యాణ్ ఏం సాధిస్తాడు అనేది ప్రశ్నార్థకమే. ఎలాగూ పవన్ కనిపించేది మరి కొన్ని నెలలే. ఎన్నికలు అయ్యేంత వరకూ పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. ఆ తర్వాత ఎలాగూ సినిమాలు అంటూ బిజీ అయిపోతాడు,. పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మిగిలిపోతాడు. కాబట్టి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏదేదో మాట్లాడతాడు.

ఇక ప్రత్యేకించి జగన్ విషయంలోనే పవన్ ఇలా అక్కసు వెల్లగక్కడం వెనుక వేరే కథ కూడా ఉందని అంటున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో తన పార్టీ పరిస్థితి గురించి కూడా సర్వే చేయించుకున్నాడట. అందులో.. ఏమంత ఆశాజనకమైన ఫలితాలు రాలేదని సమాచారం. పవన్ కల్యాణ్ కొన్ని నెలలుగా ఆ జిల్లాల్లోనే కష్టపడుతూ ఉన్నాడు. అయినా.. ఆ జిల్లాల్లో వైసీపీనే లీడ్ లో ఉందని పవన్ సొంత సర్వేలు తేల్చాయట. దీంతో జగన్ మీద పవన్ కు అక్కసు తీవ్రం అయ్యింది. అందుకే జగన్ మీద ఫైర్ అయిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.