Home రాజకీయాలు చంద్రబాబు రాజకీయం.. కాంగ్రెస్ సీనియర్ కు ఝలక్!

చంద్రబాబు రాజకీయం.. కాంగ్రెస్ సీనియర్ కు ఝలక్!

SHARE

చంద్రబాబు మార్కు రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు షాక్ తిన్నారు. చంద్రబాబు వ్యూహం ప్రకారం తమ పార్టీ అధిష్టానం కూడా నడుచుకొంటూ ఉండటంతో ఆ నేతకు ఏకంగా టికెట్టే దక్కలేదు. ఆయన సీనియారటీ.. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన విదేయత అంతా ఇంతా కాదు.అదంతా పెద్ద చరిత్ర.

ఆయన మాత్రమే కాదు..ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి, పేరెన్నిక గన్న నాయకుడు. అయితే ఇప్పుడు ఈయనకు టికెట్టే దక్కలేదు. ఇలా సీటు కోల్పోయినది మరెవరో కాదు,.. మర్రి శశిధర్ రెడ్డి. సనత్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న శశిధర్ రెడ్డికి బాబు మార్కు రాజకీయంతో సీటు దక్కలేదు,

ఆ సీటును తనపార్టీకి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అక్కడ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ ను పోటీ చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీంతో శశిధర్ రెడ్డికి టికెట్ దక్కలేదు.

కాంగ్రెస్ పార్టీలో శశిధర్ రెడ్డి ప్రస్థానం ఏమిటో చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా ఈ రాజీయంలో ఉన్నాడు. పార్టీ తరఫున గట్టిగా నిలబడ్డాడు. అయితే ఈ రోజు చంద్రబాబు రాజకీయంతో శశిధర్ రెడ్డి ఎన్నికల ముందే ఓడిపోయాడు. మరీ టికెట్ కూడా సంపాదించుకోలేని స్థితిలోకి పడిపోయాడు. తమ పార్టీ సీనియర్ అయినా.. కాంగ్రెస్ హై కమాండ్ కూడా శశిధర్ రెడ్డిని అసలు పట్టించుకుంటున్నట్టుగా లేదు.