Home రాజకీయాలు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినట్టేనా..!

చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినట్టేనా..!

SHARE

తప్పు చేసిన వాళ్లకే భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భయాన్ని ఒకసారి కాదు.. ఒకరకంగా కాదు.. అనేక సార్లు అనేక రకాలుగా బయటపెడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తనపై కేసులు పెడతారని.. తనను అరెస్టు చేస్తారని..చంద్రబాబు నాయుడు అనేక సార్లు వాపోతూ వస్తున్నాడు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తే తన చుట్టూ అందరూ నిలబడి తనను రక్షించుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్పుకొచ్చాడు. అప్పుడే బాబు కథ బయటపడింది.
అప్పుడే కాదు.. ఆ తర్వాత కూడా అనేక సార్లు అదే కథ. తాజాగా ఏపీలో సీబీఐ యాక్టివిటీస్ ను నిరోధిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆయన పరిస్థితిని మరింత తేటతెల్లం చేస్తోంది. చంద్రబాబుకు ఏవో భయాలున్నాయి. ఆ భయాలు ఎందుకు అంటే… బాబు ఎక్కడో తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డాడు. ఆ వ్యవహారాలు బయటకు వస్తాయేమో అని బాబు భయపడుతూ ఉన్నాడు.

అందుకే ఇప్పుడు సీబీఐ ఏపీలో అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు వాదిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటి ఏమిటంటే.. ఇటీవలే జగన్ పై హత్యాయత్నం జరిగింది. ఆ అంశంలో కేంద్ర ప్రభుత్వ విచారణను లేదా థర్డ్ పార్టీ విచారణను కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు ఎక్కింది. ఆ పిటిషన్ పై విచారణ సాగుతూ ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు ఆ వ్యవహారంలో నోటీసులు కూడా జారీ అయ్యాయి.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి సీబీఐ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదని అంటున్నాడు. జీవో కూడా ఇచ్చేశాడు. ఇదంతా చూస్తుంటే జగన్ పై హత్యాయత్నం వ్యవహారంలో సీబీఐ విచారణ మొదలు కానున్నదనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడా? ఆ వ్యవహారంలో బాబు ప్రమేయం బయటపడుతుందనే సీబీఐని అడుగు పెట్టనీయమని అంటున్నారా? అనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు పరిశీలకులు.

జగన్ పై హత్యాయత్నం వ్యవహారంలో కాకపోయినా.. ఇతర కేసుల్లో కూడా బాబుకు సీబీఐ విచారణ పొంచి ఉందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.