Home రాజకీయాలు పవన్ కల్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికేశాడా!

పవన్ కల్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికేశాడా!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడబోయి ఆ పార్టీకి అడ్డంగా దొరికేశాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. జగన్ మీద వీరలెవల్లో విరుచుకుపడబోయిన పవన్ .. రొటీన్ గా తనకు తోచిన మాటలేవో మాట్లాడాడు. పవన్ చేసే విమర్శల్లో కూడా అర్థం ఉండదు కదా.. ఆయన ప్రసంగాల వలె.. విమర్శలు కూడా అంతుబట్టని రీతిలో ఉంటాయి.

అదే రీతిన పవన్ కల్యాణ్ జగన్ ఎందుకు తెలంగాణ నేతలను విమర్శించడం లేదు? అని ప్రశ్నించాడు. అసలుకు ఇది ఎంత అర్థం లేని ప్రశ్నో చెప్పనక్కర్లేదు. తెలంగాణ నేతలను ఎందుకు విమర్శించడం లేదు? అనడం ఏమిటి అసలు? ఏపీ పొలిటీషియన్లు తెలంగాణ నేతలను విమర్శిచాల్సిన అవసరం ఏమిటోపవన్ కే తెలియాలి.

తెలంగాణలో ఆంధ్రా వాళ్లను తరిమి కొడుతుంటే తను స్పందించానని కూడా పవన్ చెప్పుకొచ్చాడు. తెలంగాణలో అలాంటివేమీ జరగలేదు. అయినా జరిగినట్టుగా తను స్పందించనట్టుగా పవన్ చెప్పుకొచ్చాడు. మరి పవన్ ఏమైనా కల కన్నాడేమో!

ఆ సంగతలా ఉంటే.. జనసేన అధిపతి ఇక్కడ వైసీపీ అడ్డంగా దొరికాడు. అదెలాగంటే.. ఆ మధ్య పవన్ కల్యాణ్ వెళ్లి కేసీఆర్ ను కలిశాడు. అదేదో ఆంధ్రుల సమస్యలను చర్చించడానికి కాదు.. తన సినిమాల ప్రివ్యూ షో ల కోసం. తన సినిమా ప్రివ్యూ షోలు వేసుకోవడానికి అనుమతించాలని పవన్ కేసీఆర్ ను కలిశాడు. ఇలా తన వ్యాపారం కోసం పీకే వెళ్లాడు.

ఆ సందర్భంలో కేసీఆర్ ను తెగ పొగిడేశాడు కూడా. అదీ పాయింట్. ఈ పాయింట్ నే వైసీపీ పట్టుకుంది. సినిమాల ప్రివ్యూ కోసం కేసీఆర్ ను కలిసిన నువ్వా మమ్మల్ని విమర్శించేది అని పవన్ కల్యాణ్ ను వైసీపీ ప్రశ్నించింది. దీనికి జనసేన నుంచి మాటలు లేవు. జనాల్లో కూడా ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. ఏదో మాట్లాడబోయి..మరేదో మాట్లాడి పవన్ ఇలా బుక్ అయ్యాడు.