Home రాజకీయాలు మహాకూటమిలో రాజుకున్న మంటలు..!

మహాకూటమిలో రాజుకున్న మంటలు..!

SHARE

ఒకవైపు తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ క్లైమాక్స్ కు వస్తే.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే కొత్త మంటలు పడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు ఇప్పుడిప్పుడే జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో.దీంతో రచ్చలు తప్పడం లేదు. రాజీనామాలు కూడా జరుగుతూ ఉన్నాయి.

తాజాగా ఈ జాబితాలో చేరాడు కార్తిక్ రెడ్డి. మాజీ హోం మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి తనయుడు ఇప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు. తనకు రాజేంద్రనగర్ సీటును ఇవ్వనందుకు కార్తిక్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా ప్రకటించాడు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కూడా రాజీనామా చేశారు.రాజేంద్రనగర్ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించారు కాంగ్రెస్ వాళ్లు.

ఈ విషయంలోనే కార్తిక్ రెడ్డి నుంచి నిరసన వ్యక్తం అవుతూ ఉంది. కార్తిక్ రెడ్డితో పాటు ఆయన తల్లి సబిత కూడా రాజీనామా చేయనుందని వార్తలు వస్తున్నాయి. వారద్దరూ ఇండిపెండెట్స్ గా నామినేషన్ దాఖలు చేస్తారట. ఈ నేపథ్యంలో రాజకీయం రసకందాయకంలో పడింది.

రాజేంద్రనగర్ లో తెలుగుదేశం పార్టీకి అసలేమాత్రం బలం లేదని.. అలాంటి పార్టీకి ఈ సీటును ఎలా కేటాయిస్తారని వారుప్రశ్నిస్తూ ఉన్నారు.
కేవలం ఈ నియోజకవర్గం మాత్రమే కాదు.. మరిన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి రచ్చలే కొనసాగుతూ ఉన్నాయి. చాల చోట్ల తిరుగుబాట్లు రెబల్స్ బయటకు వస్తున్నారు. రేపు వీళ్లంతా నామినేషన్లకు రెడీ అవుతున్నారు.