Home రాజకీయాలు కేటీఆర్.. చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు!

కేటీఆర్.. చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు!

SHARE

తనకు ముఖ్యమంత్రి కావాలని లేదని ఒకటికి పది సార్లు చెబుతున్నాడు కేటీఆర్. తను ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదని మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా కేసీఆర్ తనయుడు ప్రకటిస్తూ వస్తున్నాడు. ఒకసారి అంటే ఏదోలే అనుకోవచ్చు. అయితే కేటీఆర్ అనేక మార్లు ఇదే విషయాన్ని చెబుతున్నాడు.

ఇక్కడ స్పష్టం అవుతున్న విషయం ఏమిటంటే.. తను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను అని చెబితే ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో అని కేటీఆర్ భయపడుతున్నాడు. అందుకే తను ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదని.. తనకు ఆ ఆశలు లేవని పదే పదే చెబుతున్నాడు.

తాజాగా మరో విషయం ఏమిటంటే.. తనకు అసలు ముఖ్యమంత్రి అయ్యే అర్హతే లేదని కేటీఆర్ చెప్పుకొచ్చాడు. మంత్రి కావడమే ఎక్కవని అన్నాడు. ఇలా తనను తాను తక్కువ చేసుకునే ప్రయత్నం చేశాడు.

మరో పదిహేనేళ్లు కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలనేది తన కోరిక అని కూడా కేటీఆర్ ప్రకటించుకున్నాడు. మరి కేటీఆర్ ఇలా ఒకటి పది సార్లు ఇదే మాట చెబుతుండటం.. తను ముఖ్యమంత్రి కావాలని అనకోవడం లేదని వివరణల మీద వివరణలు ఇస్తుండటం ఒక రకమైన భావాన్ని చాటుతోంది. తను సీఎం కావాలని అనుకుంటున్నట్టుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పడానికే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ ప్రచారాన్ని జనాలు నమ్మితే అది తమ పార్టీకి దెబ్బ అవుతుందనేది కేటీఆర్ అభిప్రాయం కావొచ్చు.