Home రాజకీయాలు ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తాడా?

ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తాడా?

SHARE

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబంతో కొత్త గేమ్ మొదలుపెట్టింది తెలిసిందే. కూకట్ పల్లి బరిలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని బాబు బరిలోకి దించనున్నాడు. ఆమె గురించి జనాలకు ఎవరికి పరిచయం కూడా లేదు. అయితే బాబు రాజకీయంతో ఆమె ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.

ఇక్కడే బాబు గేమ్ ఉంది. ఇటీవలే హరి మరణించారు. ఈ నేపథ్యంలో ఆ సానుభూతిని వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు నాయుడు హరి కూతురును రంగంలోకి దించుతున్నాడని స్పష్టం అవుతోంది.

అటు నందమూరి ఇమేజ్, ఇటు సానుభూతి ఇవన్నీ కలిసి వస్తాయని బాబు లెక్క, ఇక ఇదే సమయంలో హరి కూతురును రంగంలోకి దించితే.. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ ప్రచారానికి రావొచ్చు. ఎంతైనా సోదరి కోసం అయినా అతడు రంగంలోకి దిగుతాడు.

చంద్రబాబు వ్యూహం ఇదేనని అంటున్నారు. హరి కుటుంబంపై బాబుకు ఎలాంటి ప్రత్యేక అభిమానం లేకపోయినా.. అటు సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి,ఇటు తారక్ ను వాడుకోవడానికి చంద్రబాబు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.