Home రాజకీయాలు కాంగ్రెస్ రెండో జాబితా.. ఎట్టకేలకూ అతడికి టికెట్!

కాంగ్రెస్ రెండో జాబితా.. ఎట్టకేలకూ అతడికి టికెట్!

SHARE

తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా వచ్చేసింది. ముందుగా 65 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో జాబితాను విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ జాబితాలో 10 సీట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లున్నాయి.

వీటిలో ఆసక్తిదాయకమైనది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో విష్ణుకు టికెట్ ఖరారు అయ్యింది. అయితే చంద్రబాబుకు ఇది ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. జూబ్లీ హిల్స్ నుంచి టీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ బరిలోకి దిగనున్నాడు. అతడు గత ఎన్నికల్లో టీడీపీ తరపున నెగ్గాడు. అయితే టీఆర్ఎస్ లోకి ఫిరాయించాడు. అయినప్పటికీ కమ్మ వాళ్ల ఓట్లు మాగంటికి పడతాయనే అభిప్రాయాలున్నాయి.

చంద్రబాబు కూడా ఇదే అనుకుంటున్నాడట. అందుకే విష్ణుకు ఈ సీటు వద్దని అన్నాడట. కానీ కాంగ్రెస్ హై కమాండ్ ఈ వ్యవహారాన్ని నాన్చి.. చివరకు విష్ణుకే టికెట్ ను ఖరారు చేసింది. కాంగ్రెస్ తరఫు నుంచి మరెవరైనా. అది కూడా కమ్మ వాళ్లను నిలబెట్టాలని బాబు సూచించినా..చివరకు పీజేఆర్ తనయుడికే టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా ఇలా ఉంది.

సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి
జూబ్లీ హిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
ఖానాపూర్ (ఎస్టీ) – రమేష్ రాథోడ్
మేడ్చల్ – కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఎల్లారెడ్డి – జాజల సురేందర్
ఖైరతాబాద్ – దాసోజు శ్రవణ్
ధర్మపురి (ఎస్సీ) – అదూరి లక్ష్మణ్ కుమార్
షాద్నగర్ – సి.ప్రతాప్రెడ్డి
భూపాలపల్లి – గండ్ర వెంకట రమణారెడ్డి
పాలేరు – కాందాల ఉపేందర్రెడ్డి