Home రాజకీయాలు హరికృష్ణ కుటుంబంతో బాబు కొత్త గేమ్ స్టార్ట్స్?

హరికృష్ణ కుటుంబంతో బాబు కొత్త గేమ్ స్టార్ట్స్?

SHARE

నందమూరి కుటుంబాన్ని రాజకీయంగా తన అవసరాలకు వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఇది బాబుకు కొత్త కాదు. అవసరం అయినప్పుడు వాళ్లకు ఏదో రకమైన ప్రాదాన్యతను ఇవ్వడం, అవసరం లేనప్పుడు వాళ్లను పక్కన పెట్టేయడం బాబుకు అలవాటే.

ఈ పరంపరలో తాజాగా చంద్రబాబు నాయుడు హరి కుటుంబంతో కొత్త గేమ్ స్టార్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ సానుభూతిని వాడుకునేందుకు తగినట్టుగా, అలాగే హరి సంతానం తన చేయి దాటి పోకుండా చంద్రబాబు నాయడు కొత్త వ్యూహాన్ని అమలు పెడుతున్నాడని సమాచారం.

హరికృష్ణ తనయ సుహాసినిని చంద్రబాబు నాయుడు కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించనున్నాడని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం టికెట్ ను ముందుగా సీనియర్ నేత పెద్ది రెడ్డికి అని వార్తలు వచ్చాయి. ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టాడు.

అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుహసినిని తెర మీదకు తీసుకొచ్చాడని తెలుస్తోంది. ఆమె అయితే కమ్మవాళ్ల ఓట్లు ఖాయంగా పడతాయి. అలాగే.. హరి కృష్ణ మరణించారనే సానుభూతి కూడా ఉపయోగపడుతుంది. అలాగే రేప్పొద్దునే జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.