Home రాజకీయాలు పవన్ పై సొంత కులం నేతలకూ నమ్మకం లేదా?

పవన్ పై సొంత కులం నేతలకూ నమ్మకం లేదా?

SHARE

గత కొన్నాళ్లుగా జనసేనలోకి కొన్ని చేరికలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఈ చేరికలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చేరుతున్నది అంతా ఎందుకూ కొరగాని నేతలే అనేది గ్రౌండ్ రిపోర్ట్. తెలుగుదేశం పార్టీలోనో..అక్కడ కుదరదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనో టికెట్ ప్రయత్నాలు చేసి.. రెండు చోట్లా కుదరదు అని తేలాకా జనసేన తీర్థం పుచ్చుకుంటున్న నేతలే వాళ్లంతా.

అలాంటి వాళ్లతో పవన్ ఏం సాధిస్తాడో తెలియదు కానీ.. మరోవైపు వైసీపీలో ఒక ఆసక్తిదాయకమైన చేరిక జరిగింది. మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉండిన సీనియర్ పొలిటీషియన్ సి.రామచంద్రయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. ఈయన బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రా ఏరియాలో కాపులు, రాయలసీమలో బలిజలు ఒకటే అనుకోవాలి.

గతంలో ప్రజారాజ్యంలో కూడా పని చేశాడీయన. సి.రామచంద్రయ్యకు ఏదో గట్టి ప్రజాబలం ఉంది అని అనలేం కానీ… ఈయన జనసేనలోకి చేరకుండా వైసీపీలోకి చేరడం మాత్రం విశేషమే.

ఎందుకంటే.. ఈయన జనసేనలోకి చేరతాడనే అంతా అనుకున్నారు. ఈయనకు ఉన్న గత నేపథ్యం… కుల నేపథ్యం.. ఇవన్నీ కూడా జనసేన వైపుకే ఈయనను నడిపించాల్సింది. అయితే.. ఈయన మాత్రం వైసీపీలోకి చేరాడు. దీనికి కారణం.. ఏమిటి అంటే.. సొంత కులం నేతల్లో కూడా పవన్ కల్యాణ్ పై భరోసా లేకపోవడమే అని పరిశీలకులు అంటున్నారు.

పవన్ కల్యాణ్ ఏదో సాధిస్తాడంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. తను సీఎం అయిపోతానని పీకే అంటున్నాడు కానీ.. అదంతా జరిగే పని కాదని స్పష్టం అవుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. సొంత సామాజికవర్గం నుంచి కూడా పవన్ కు గట్టి సపోర్ట్ లభించడం లేదు. పవన్ కు ఓటేసినా అది వేస్టే అనే అభిప్రాయం, ఎలాగూ గెలవరని తెలిసి ఓటెందుకు వేస్ట్ చేసుకోవాలి..అనే మాట గోదావరి జిల్లాలోని కాపుల నుంచినే వినిపిస్తుండటం విశేషం. ఇలాంటి నేపథ్యంలో పవన్ మీద నేతల్లో కూడా అంత నమ్మకం కనిపించడం లేదు. అందుకే వీరు వేరే మార్గాల్లో వెళ్తున్నారని స్పష్టం అవుతోంది.