Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. ఇప్పుడు సమాధానమివ్వు బాబు!

జగన్ పై హత్యాయత్నం.. ఇప్పుడు సమాధానమివ్వు బాబు!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం వ్యవహారంలో హై కోర్టు ఆసక్తిదాయకమైన రీతిలో స్పందించింది. ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని హై కోర్టు పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండటం గమనార్హం.

జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో థర్డ్ పార్టీ విచారణను ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ మీద కోర్టు విచారణ జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలోఈ వ్యవహారంలో పలువురుకు నోటీసులు జారీ అయ్యాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఏపీ డీజీపీకి, అలాగే తెలంగాణ డీజీపీకీ, కేంద్ర హోం శాఖకు కూడా హై కోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
రెండు వారాల్లోకా సమాధానం ఇవ్వాలని వీళ్లందరికీ హై కోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం.

అలాగే జగన్ పై హత్యాయత్నం ఉదంతాన్ని కోర్టుకు వివరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాది.. ఈ విషయంలో నటుడు శివాజీ చెప్పిన గరుడ ఆపరేషన్ గురించి కూడా ప్రస్తావించినట్టుగా సమాచారం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనే అనుమానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. మరి హై కోర్టు నోటీసులకు ఏపీ సీఎం చంద్రబాబు ఏమని సమాధానం ఇస్తాడో చూడాల్సి ఉందిక!