Home రాజకీయాలు చంద్రబాబు దిగజారుడు..ఇంకా ఎంత వరకూ?

చంద్రబాబు దిగజారుడు..ఇంకా ఎంత వరకూ?

SHARE

ఒకవైపు ఈ దేశంలో తనకన్నా సీనియర్ నేత, తనకన్నా బెటర్ పొలిటీషియన్ , తనకన్నా మేధావి, తన కన్నా పాలకుడు.. మరొకరు లేడు అని చెప్పేవాడు. ఇందుకు రుజువులుగా బోలెడన్ని వీడియోలున్నాయి. బాబు తన గొప్ప అంటూ డబ్బా కొట్టుకున్న వైనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తనకన్నా ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్లు సీనియర్లు అని చెప్పుకొచ్చాడు.

ఇక్కడ డబ్బా కొట్టుకునే బాబు అక్కడ మాత్రం వాళ్ల కాళ్లు వత్తేలా మాట్లాడాడు. ఇక తాజాగా చెన్నై వెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు స్టాలిన్ ను పొగిడేశాడు. ఎంతగా అంటే.. ప్రధాని మోడీ కన్నా స్టాలిన్ గొప్ప నేత అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు.

ఇలా భజన పార్టీగా మారాడు చంద్రన్న. స్టాలిన్ ఇప్పటి వరకూ తన సీఎం డ్రీమ్ ను తీర్చుకోలేదు. ఎన్నో యేళ్లుగా తండ్రి చాటు కొడుకుగానే మిగిలిపోయాడు. నిజంగానే స్టాలిన్ సమర్థుడే అయితే..కరుణానిధి ఎప్పుడో అతడిని సీఎం సీట్లో కూర్చోబెట్టే వాడు. స్టాలిన్ సీఎం సీట్లో కూర్చుంటే డీఎంకే అల్లకల్లోలం అవుతుందని కరుణానిధి ఆగిపోయాడు. ఆఖరికి స్టాలిన్ మీద ఆయన సోదరులుకు కూడా నమ్మకం లేదు.

అయితే చంద్రబాబు మాత్రం స్టాలిన్ తోపు, తురుము అన్నట్టుగా మాట్లాడాడు. ఇంత రాజకీయ శూన్యతలో కూడా వచ్చేసారి తమిళనాడుకు స్టాలిన్ సీఎం అవుతాడనే గట్టి నమ్మకం ఎవరిలోనూ లేదు. అయితే చంద్రబాబు మాత్రం స్టాలిన్ ను పొగిడేశాడు. గతంలో దేశానికి ఇంత వరకూ ప్రధానమంత్రులు అయిన వాళ్లలో కెళ్లా.. మోడీనే సమర్థుడు అని చంద్రబాబు వ్యాఖ్యానించాడు. అది కూడా అసెంబ్లీలో. ఇప్పుడు మాత్రం మోడీ కన్నా.. ఇంత వరకూ ఏం సాధించని స్టాలిన్ గొప్పోడని బాబు చెప్పుకురావడం ఆయన దిగజారుడుకు నిదర్శనం.