Home రాజకీయాలు పవన్.. ఇలా మాట్లాడే ఉన్న పరువూ పోగొట్టుకుంటాడా?

పవన్.. ఇలా మాట్లాడే ఉన్న పరువూ పోగొట్టుకుంటాడా?

SHARE

తను ముఖ్యమంత్రిని అవుతానని పవన్ చెప్పుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి కావడం అంటే ఏమిటో.. ఇప్పటికీ పవన్ కు అర్థం అయినట్టుగా లేదు. సీఎం పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని తన అన్న చిరంజీవి ఎంత కష్టపడ్డాడో.. ఆ పార్టీ తరఫున తను ఎంతగా తిరిగాడో పవన్ కు తెలిసే ఉండాల్సింది. అంత కష్టపడితే చిరంజీవికి దక్కింది ఏమిటి? చిరంజీవి సాధించింది ఏమిటి? అనే అంశాలు అందరికీ తెలిసినవే.

అయితే చిరంజీవి ప్రజలను దారుణంగా మోసం చేసి వెళ్లాడు. ఆ ప్రభావం పవన్ కల్యాణ్ మీద కూడా పడుతోంది. జనసేన అంటూ వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్ మీద జనాల్లో నమ్మకం కలగడం లేదు. ఇక పవన్ కల్యాణ్ తీరు కూడా అలాగే ఉందనుకోండి.

ఇక పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయాలను విస్మరించి మాట్లాడుతూ ఉన్నాడు. తను సీఎం అయిపోతానని అంటున్నాడు. అంతచేసీ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ తిరిగింది, తిరుగుతోంది రెండు జిల్లాల్లోనే. వాటిని దాటి బయటకు రావడం లేదు. మరి రెండు జిల్లాల్లో ప్రచారం చేసుకుంటేనే సీఎం అయిపోతానా అనే విషయం పవన్ కల్యాణ్ కు తెలియాలి!

అదలా ఉంటే.. తెలంగాణలో తన పార్టీ పోటీ చేయకపోవడానికి రీజన్ చెప్పుకొచ్చాడు పీకే. తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయని.. అందుకే తను పోటీ చేయలేకపోతున్నట్టుగా పవన్ చెప్పుకొచ్చాడు. ఇదీ పవన్ తీరు. పార్టీ పెట్టిఐదేళ్లు అవుతున్నా పవన్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీరిక దొరకలేదు. తెలంగాణలో తాము పోటీ చేయకపోవడానికి పవన్ వేరే ఏవైనా రీజన్లను వెదుక్కోవాల్సింది కానీ.. మరీ ఇలా మాట్లాడి బ్యాలెన్స్ పరువును ఎందుకు పోగొట్టుకుంటున్నాడో!