Home రాజకీయాలు జగన్ ఏం చెబుతాడు.. అనేదే హాట్ టాపిక్!

జగన్ ఏం చెబుతాడు.. అనేదే హాట్ టాపిక్!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మళ్లీ మొదలైంది. హత్యాయత్నం నేపథ్యంలో పదిహేడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన పాదయాత్రను మళ్లీ కొనసాగిస్తూ ఉన్నారు. సాలూరు నియోజకవర్గంలో ఈ రోజు జగన్ పాదయాత్ర మళ్లీ మొదలైంది.

విజయనగరం జిల్లాలో దాదాపు జగన్ పాదయాత్ర ముగుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఎంటర్ కానుంది.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను పునఃప్రారంభించిన నేఫథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది.

జగన్ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్న నేఫథ్యంలో మళ్లీ పాదయాత్రను ప్రారంభించడంతో వైసీపీలో ఒకింత ఆందోళన కూడా వ్యక్తం అవుతూ ఉంది. జగన్ మోహన్ రెడ్డికి ఏమైనా అవుతుందేమో అనే భయం వ్యక్తం అవుతూ ఉంది. అయితే జగన్ వైరి పక్షాలు మళ్లీ అలాంటి సాహసం చేయకపోవచ్చు.

ఇక ఇప్పుడు మరో హాట్ టాపిక్ ఏమిటంటే.. తనపై జరిగిన హత్యాయత్నం గురించి జగన్ ఏం చెబుతాడు? అనేది. ఈ విషయంలో జగన్ ఎలా స్పందిస్తాడు? అనే అంశం పై చర్చ జరుగుతోంది. తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో విచారణను కోరుతూ జగన్ కోర్టును కూడా ఆశ్రయించాడు.
మరి ప్రజల ముందు జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తాడు? ఏం చెబుతాడు? అనేవి అత్యంత ఆసక్తిదాయకమైన అంశాలు. ఈ అంశాలపై జగన్ పాదయాత్రలో భాగంగా పాల్గొనే తొలి సభలోనే స్పష్టత రానుంది.