Home ప్రత్యేకం జగన్ రిటర్న్స్.. పాదయాత్ర మళ్లీ మొదలు..ఇక ఫుల్ హీట్!

జగన్ రిటర్న్స్.. పాదయాత్ర మళ్లీ మొదలు..ఇక ఫుల్ హీట్!

SHARE

జరిగింది చిన్న విషయం కాదు. తేలికైన విషయం కాదు. జగన్ ను చంపాలని చూశారు. హత్యకు కుట్ర పన్నారు. ఇందులో తెలుగుదేశం ముఖ్యుల హస్త ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా చెబుతోంది. అయితే దీనిపై నిజమైన విచారణ జరుగుతుంది.. కుట్ర కోణం బయటకు వస్తుంది అనే నమ్మకం ఎవరిలోనూ లేదు. అధికారం చంద్రబాబు చేతిలో ఉన్నంత సేపూ కూడా ఈ అంశంపై అసలు విషయం బయటకురాదు.. అని స్పష్టం అవుతోంది.

కోర్టును ఆశ్రయించినా… మరేం చేసినా.. ఈ విషయంలో కుట్ర కోణం బయటకు రాదని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ మళ్లీ బయటకు వస్తున్నాడు. గత కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న జగన్ రేపటి నుంచి మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నాడు.

జగన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఎక్కడైతే జగన్ పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచినే అది మళ్లీ మొదలునుకానుంది.

రేపు జగన్ పాదయాత్రకు జనహోరు ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అలాగే ఇకపై జగన్ పాదయాత్ర మరింత పొలిటికల్ హీట్ ను రేపుతుంది. తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో జగన్ ఏం చెబుతాడో కూడా రేపే తెలియనుంది.

ఇక జగన్ కు రేపటి నుంచి ప్రభుత్వం ఏ మేరకు భద్రతను ఏర్పరుస్తుంది అనేది కూడా చర్చనీయాంశమే. ఇకపై పాదయాత్ర జరిగినన్ని రోజులూ.. అందరి దృష్టీ అటువైపే ఉంటుంది. రాజకీయం రసవత్తరంగానే సాగుతుంది. మరి కొన్ని రోజుల పాటు జగన్ పాదయాత్ర సాగనుంది. అనంతరం బస్సు యాత్రకు వైసీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.