Home రాజకీయాలు విశాఖ నుంచి పోటీకి రెడ్డిగారు సై!

విశాఖ నుంచి పోటీకి రెడ్డిగారు సై!

SHARE

కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డి మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నాడట. గల్లీలో ఏమో కానీ.. ఢిల్లీలో మాత్రం రెడ్డిగారికి మంచి పట్టుంది. సోనియాగాంధీ స్థాయిలో పరిచయాలున్నాయి. ఎవరినైనా తను ఇచ్చే పార్టీలకూ, తను చేసే ఫంక్షన్లకు రప్పించుకోగలడు సుబ్బరామిరెడ్డి. ఆ స్థాయిలో రిలేషన్ షిప్స్ ఉన్నాయి ఈ నెల్లూరు రెడ్డికి.

ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ నేతే. అన్ని పార్టీల్లోనూ పరిచయస్తులున్నారు. కాంగ్రెస్ పార్టీ పలు సార్లు సుబ్బరామిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేసిన నేపథ్యం ఉంది ఈయనకు. జగన్ పార్టీలోకి పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయినప్పుడు.. నెల్లూరు సీటుకు జరిగిన బై పోల్ లో కాంగ్రెస్ తరఫున నిలిచింది సుబ్బరామిరెడ్డే. మేకపాటికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడాడు టీఎస్సార్.

అయితే..ఇప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ కాంగ్రెస్ సీనియర్ ఉత్సాహంగా ఉన్నాడట. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకు టీఎస్సార్ రెడీ అవుతున్నాడని సమాచారం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమైన నేపథ్యంలో విశాఖ నుంచి టీఎస్సార్ పోటీ చేయాలని అనుకుంటున్నాడట.

ఈ మేరకు పొత్తులో భాగంగా విశాఖ సీటును కాంగ్రెస్ కు చంద్రబాబు కేటాయిస్తాడని.. అక్కడ నుంచి సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. రెడ్డిగారి ఆర్థిక బలం నేపథ్యంలో ఆ సీట్లో టికెట్ ను సంపాదించుకోవడం కష్టం కాకపోవచ్చు.