Home రాజకీయాలు బాబు తీరుతో ఏపీ టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు!

బాబు తీరుతో ఏపీ టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు!

SHARE

ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేఫథ్యంలో ఏపీ టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక్కడ టీడీపీకి రెండు రకాల టెన్షన్ ఉంది. అందులో ఒకటి.. కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ చేతులు కలిపితే జనాలు ఒప్పుకుంటారా? అనేది మొదటి ప్రశ్న.

రెండోది..కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తామంత సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది అనేది. ముందుగా మొదటి దాని విషయానికి వస్తే.. ఏపీని విభజించింది కాంగ్రెస్ పార్టీనే. విభజన పాపం ఖాయంగా సోనియా, రాహుల్ గాంధీలదే. ఈ విషయంలో ఏం సందేహం లేదు.

మొన్నటి వరకూ చంద్రబాబు కూడా ఇదే చెబుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు బాబు లెక్కలు మారిపోయాయి. చంద్రబాబు అంటే అవకాశవాది కాబట్టి తన అభిప్రాయాలను టక్కున మార్చేసుకుంటాడు. ప్రజలకు ఆ అవసరం ఏముంది?

అందుకే కాంగ్రెస్ మీద వారికి స్థిరమైన అభిప్రాయాలున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజల్లో ఏ మాత్రం సానుకూలత లేదు. అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని సాధించేది ఏమీ లేదు. ఇక టీడీపీ మూలాలు అన్నీ కాంగ్రెస్ వ్యతిరేకత మీదే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏ రకంగా చూసినా.. కాంగ్రెస్ తో ఏపీలో పొత్తు టీడీపీకి మైనస్ పాయింటే.

ఇక ఇప్పటికే సీట్ల విషయంలో టీడీపీలో తీవ్రమైన లొల్లి సాగుతూ ఉంది. ఫిరాయింపుదారులు, పార్టీలోని వారికి మధ్యన ఇరవై సీట్లలోరచ్చ సాగుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు అంటూ చంద్రబాబు మరి కొందరు త్యాగాలు చేయాలని అంటే.. దానికి టీడీపీ లోని పాత కాపులు కస్సు మనే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీ టీడీపీలో ఈ అంశాల మీదే చర్చ సాగుతూ ఉంది!