Home ప్రత్యేకం చంద్రబాబూ.. ఆ అప్పు గోడలపై రాసే ధైర్యముందా?

చంద్రబాబూ.. ఆ అప్పు గోడలపై రాసే ధైర్యముందా?

SHARE

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

‘రాజధాని అమరావతి గ్రామాల్లో సకల సదుపాయాలు కల్పిస్తామని,స్కూళ్ళు, హాస్పిటళ్ళు కడతామని,ఏడాదిలోపు పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామని 2015లో బాబు ఆర్భాటంగా ఇచ్చిన హామీలకు ఇప్పటికీ అతీగతీ లేదు. కనీస వసతులు లేక ఆ గ్రామాలు కునారిల్లుతుంటే నాయుడుబాబు మాత్రం రియల్‌ ఎస్టేట్‌పైనే శ్రద్ధ పెట్టాడు.’ అని మండిపడ్డారు.

‘తలసరి ఆదాయంలో ఏపీ దేశంలోనే నెంబర్‌ వన్‌ అంట. గ్రామ సీమలు వెలిగిపోతున్నాయట. ఈ సత్యాన్ని గోడ రాతల ద్వారా ప్రచారం చేయాలట. నాలుగున్నరేళ్లలో చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పుల వలన ప్రతీ పౌరుడి తలపై ఎంత అప్పు చేరిందో కూడా గోడ రాతల ద్వారా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా’ అని సూటిగా ప్రశ్నించారు. గత కొంతకాలంగా చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తోన్న తప్పులను సోషల్‌ మీడియా ద్వారా విజయసాయి రెడ్డి ఎండగడుతున్న సంగతి తెల్సిందే.