Home సినిమా ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి సినిమాకు భీకరమైన టైటిల్..

ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి సినిమాకు భీకరమైన టైటిల్..

SHARE

ఎన్టీఆర్, రాంచరణ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విచ్చేయనునట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. బాహుబలి చిత్రంలో భాగమైన చాలామంది ఈవేడుకకు అతిథులుగా హాజరవుతారట.

ఇద్దరు క్రేజీ హీరోలు కలసి నటిస్తున్న చిత్రం, అందులోను రాజమౌళి దర్శత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి ప్రారంభమైంది. నెటిజన్లంతా చిత్రం ఎలా ఉండబోతోంది, టైటిల్ ఏంటి, ఏ నేపథ్యంలో కథ ఉండబోతోంది అనే చర్చలో తలమునకలై ఉన్నారు.

ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే కాదని.. అందులోనే భీకరమైన టైటిల్ దాగుందని అటు సినీవర్గాల్లో, అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ‘రామ రావణ రాజ్యం’ అనేది ఈ చిత్ర టైటిల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది.