Home రాజకీయాలు మహాకూటమి..ఇక మరింత రసవ్తతరం!

మహాకూటమి..ఇక మరింత రసవ్తతరం!

SHARE

మొత్తానికి మహాకూటమిలోని పార్టీల మధ్యన సీట్ల వ్యవహారం సెటిలైంది. పంచుకోవాల్సింది తక్కువ సీట్టే అయినా కూటమిలోని పార్టీలకు మాత్రం ఆ పంచుకోవడం తేలిక కాలేదు. ఈ విషయంలో తీవ్రమైన చర్చోపచర్చలు చేసి కానీ.. ఏమీ తేల్చుకోలేకపోయారు. ఇక నామినేషన్ల ప్రక్రియకు గడువు దగ్గర పడుతుండటంతో చివరికి ఎలాగో తేల్చుకున్నారు.

అయితే ఇప్పుడు కూడా తేలింది ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశం మాత్రమే. ఎవరికి ఎన్ని సీట్లో తేల్చుకున్నారు.. ఇక ఏ సీటు ఎవరికో తేలాల్సి ఉంది. ఇదే అసలైన కథ.

సీట్ల నంబర్ విషయంలో ఏకాభిప్రాయం రావడానికే ఇంత సమయం పట్టింది. ఏ సీటు ఎవరికో అనే విషయంలో ఏకాభిప్రాయం వస్తుందా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే.. ఒక పార్టీ ఆశిస్తున్న సీట్ల విషయంలో ఇతర పార్టీల కన్ను కూడా ఉంది. దీంతో కూటమిలో అసలైన లొల్లి ఇప్పుడే మొదలయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే ఏ పార్టీకి ఏ సీటు అనే విషయంలో కొంత ప్రచారం.. మరి కొన్ని లీకులు చర్చలోకి వచ్చాయి. వాటి విషయంలోనే కార్యకర్తలు రచ్చకు ఎక్కారు. తమ పార్టీకి కాకుండా మరో పార్టీ పోటీ చేస్తే సహకరించేది లేదని వారు బహిరంగంగా హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మహాకూటమి రాజకీయాలు ముందు ముందు మరింత రసవత్తరంగా మారనున్నాయి.