Home రాజకీయాలు నవ్విపోదురుగా చంద్రబాబుకేటి సిగ్గు!

నవ్విపోదురుగా చంద్రబాబుకేటి సిగ్గు!

SHARE

ఎవ్వరు నవ్వకుంటే ఏం.. చంద్రబాబు నాయుడుకు నిస్సిగ్గు రాజకీయం అలవాటు అయిపోయింది. దాన్నే కొనసాగిస్తూ సాగుతున్నాడు ఆయన. తన నిస్సిగ్గు రాజకీయంలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయడు ఏనాడూ వెనుకాడట. ప్రత్యేకహోదా వంటి కీలకమైన అంశంలోనే ఈ విషయం తేటతెల్లం అయిపోయింది.

అంతకు ముందు తెలంగాణలో తన పార్టీని బతికించుకోవడానికి అని రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చరిత్ర ఉంది చంద్రబాబుకు. ఇక ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు పిల్లి మొగ్గలకు లోటే లేదు. బీజేపీతో స్నేహం కావాలనుకున్నంత సేపూ కూడా బాబుకు హోదా వద్దనిపించింది.
కేంద్రం బ్రహ్మాండంగా సాయంచేస్తోందని.. హోదాతో ఏమీ రాదని అప్పట్లో చంద్రబాబు నాయుడు వాదించాడు. హోదా అని ఎవరైనా అంటే జైలుకే అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడేమో హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని బాబు వాదిస్తున్నాడు. ఇలా తన రాజకీయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి కూడా బాబు వెనుకాడకుండా సాగుతూ ఉన్నాడు.

ఇక ఇప్పుడు బాబు నిస్సిగ్గు రాజకీయంలో మరో చాప్టర్ బీజేపీ వ్యతిరేక కూటమి విషయంలో సాగుతోంది. ఈ కూటమిని తనే ఏర్పాటు చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తున్నాడు. ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ అని ఒక కూటమి ఉంది. ఆ కూటమిలో చాన్నాళ్ల నుంచి ఉన్న నేతలను బాబు కలుస్తున్నాడు. తను ఆ కూటమిలోకి చేరి వారికి దండాలు పెట్టి వస్తున్నాడు.

జరుగుతున్నది అది అయితే.. పైకి మాత్రం ఆ కూటమిని తనే ఏర్పాటు చేస్తున్నాను అన్నట్టుగా బాబుచెప్పుకుంటున్నాడు. అందరినీ తనే కలుపుతున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇలాంటి నిస్సిగ్గు రాజకీయాలు బాబుకు కొత్త కావు కదా!