Home రాజకీయాలు లేటెస్ట్ సర్వే.. బీజేపీ, తెరాసలకు ఊరట!

లేటెస్ట్ సర్వే.. బీజేపీ, తెరాసలకు ఊరట!

SHARE

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిల్లో బీజేపీ ఎలాంటి ఫలితాలు పొందుతుంది? అనేది దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అంశం. ఎందుకంటే. ఈ ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా కమలం పార్టీకి తిరుగు ఉండదు. అలా కాకుండా.. ఇప్పుడు గనుక బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వస్తుంది.

అందులోనూ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో పోరాటం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే జరగబోతోంది. ఇలాంటి నేపథ్యంలో పై చేయి ఎవరిది అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న అంశం.

ఇప్పటికే ఈ రాష్ట్రా్లో ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో వివిధ సర్వేలు వస్తున్నాయి. తాజాగా ఇండియాటుడే కూడా తన సర్వేను వెల్లడించింది. దీని ప్రకారం.. రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కవచ్చు. ప్రతి ఐదేళ్లకూ ఒక పార్టీని మార్చేయడం ఆ రాష్ట్రంలో అలవాటే. ఈ సారి కూడా అదే జరగబోతోందని ఈ సర్వే అంచనా వేసింది.

అయితే మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీకి సానుకూలత ఉంటుందని ఈ సర్వే చెబుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే పలు పర్యాయాలు బీజేపీ నెగ్గింది. అయినా మరోసారి బీజేపీకే ఛాన్స్ ఉందని ఈ సర్వే చెబుతోంది. ఇది కాంగ్రెస్ ఝలక్కే.

ఇక చత్తీస్ గడ్ లో కూడా బీజేపీకి తిరుగు ఉండదని ఈ సర్వే అంచనా వేసింది. మరి ఈ మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గితే ఆ పార్టీకి అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. ఇక తెలంగాణ రాజకీయ పరిస్థితి గురించి కూడా ఈ సర్వే అంచనా వేసింది. దాని ప్రకారం.. ఇక్కడ కేసీఆర్ కు తిరుగుఉండదట. ఇక్కడ మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే అని తెలుస్తోంది.