Home రాజకీయాలు బాబు పాత ట్వీట్లకు భలే గిరాకీ!

బాబు పాత ట్వీట్లకు భలే గిరాకీ!

SHARE

మాట మార్చడంలో సిద్దహస్తుడు చంద్రబాబు నాయుడు. ఏ విషయంలో అయినా మొదట ఒక మాట మాట్లాడటం, మళ్లీ మరో మాట మాట్లాడటం బాబుకు అలవాటే. ఇలా మాట మార్చడంలో కూడా బాబు గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. మొదట ఏదైతే మాట్లాడతాడో.. అందుకు వ్యతిరేకమైన మాటను కూడా అంతే గట్టిగా మాట్లాడతాడు.ఇలాంటి చరిత్ర ఎంతో ఉంది చంద్రబాబుకు.

ఇక సోషల్ మీడియా యుగంలో కూడా బాబు మాటలు మార్చడం ఆగడం లేదు. మొదట ఏదో ఒకటి ట్వీట్ పెడతాడు. తర్వాత తన అవకాశాన్ని బట్టి చంద్రబాబు అందుకు విరుద్ధమైన ట్వీట్ పెడుతూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో బాబు పాత ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి.

ఇది వరకూ బాబు కాంగ్రెస్ మీద విరుచుకుపడుతూ ట్వీట్లు పెట్టాడు. అవినీతి పార్టీలే కాంగ్రెస్ తో జత కలుస్తాయని బాబు ట్వీటాడు. తెరాస, వైకాపాలు కాంగ్రెస్ తో జతకలుస్తామని బాబు అప్పట్లో చెప్పాడు. అయితే..చివరకు తనే కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. ఆ సమయంలో బాబు పాత ట్వీట్ ఒకటి వైరల్ అయ్యింది.

ఇక నోట్ల రద్దు జరిగి రెండేళ్లు అయిన సందర్భంగా బాబు దాన్ని తప్పు పడుతూ తాజాగా ట్వీట్ పెట్టాడు. అయితే రెండేళ్ల కిందట నోట్ల రద్దు జరిగినప్పుడు బాబు చాలా గట్టిగా సమర్థించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నెటిజన్లు పాత ట్వీట్ ను, కొత్త ట్వీట్ ను పక్క పక్కనే పెట్టి బాబుతో ఆటాడేస్తున్నారు.