Home సినిమా క్రిస్మస్ కానుకగా అంజలి త్రీడి చిత్రం ‘లిసా’

క్రిస్మస్ కానుకగా అంజలి త్రీడి చిత్రం ‘లిసా’

SHARE

ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించనుంది ఆ చిత్రమే “లిసా’. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.

‘గీతాంజలి’ ఫేమ్‌ అంజలి లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘లిసా’. బ్రహ్మానందం, సామ్‌ జోన్స్, మకరంద్‌ దేశ్‌పాండే, సలీమా, సబితా రాయ్, సురేఖ వాణి, కల్యాణి నటరాజన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాజు విశ్వనాథ్‌ దర్శకత్వంలో పీజీ మీడియా వర్క్స్‌ సమర్పణలో పి.జి.ముత్తయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం  షూటింగ్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. రాజు విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘100 రోజులకు పైగా ‘లిసా’ షూటింగ్‌ జరిగింది. ఒక సినిమా షూటింగ్‌ ఎంత కష్టమో తెలిసిందే. ఇక త్రీడీలో అయితే మరింత కష్టమైన పని. కానీ, పీజీ ముత్తయ్యగారి కష్టం వల్ల సజావుగా పూర్తయింది.

తన పాత్రకి న్యాయం చేశారు అంజలి. నటి సలీమాగారు రెండు దశాబ్దాల తర్వాత మా చిత్రంలో నటించారు’’ అన్నారు. ‘‘లిసా’ చిత్రానికి నేను నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాను. ఇండియాలో ఫస్ట్‌ స్టీరియోస్కోపిక్‌ 3డీ హారర్‌ మూవీగా హీలియం 8కే కెమెరాతో చిత్రీకరించాం. డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ముత్తయ్య అన్నారు. ‘‘మొదటిసారి 3డీ చిత్రంలో నటించా. రాజు విశ్వనాథ్‌ వంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ముత్తయ్య ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు అంజలి. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ దయానిధి.