Home ప్రత్యేకం ఎన్నికలొస్తున్నాయ్..మోడీ గేమ్ మొదలైందా!

ఎన్నికలొస్తున్నాయ్..మోడీ గేమ్ మొదలైందా!

SHARE

అవతల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు దగ్గర పడుతున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు.. ఇలాంటి నేపథ్యంలో మోడీ కూడా తనవైన వ్యూహాలను అమల్లో పెడుతున్నట్టుగా ఉన్నాడు. తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో మోడీ కూడా నష్ట నివారణ చర్యలను చేపట్టినట్టుగా తెలుస్తోంది.

అందులో భాగంగా మోడీ ఇప్పుడు ముందుగా పెట్రో ధరల మీద కాన్సన్ ట్రేట్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఇన్ని రోజులూ ఇబ్బడిముబ్బడిగా పెట్రో ధరలు పెరుగుతున్నా చూస్తూ ఊరుకున్న మోడీ ఇప్పుడు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అందుక సాక్ష్యం గత కొన్ని రోజుల పరిణామాలు. గత ఇరవై రోజుల్లో పెట్రో ధరల్లో పెరుగుల లేదు. అప్పటి వరకూ పెట్రో ధరలను ఇష్టానుసారం పెంచారు. ఒక దశలో అయితే.. పెట్రోల్ ధర లీటరుకు వంద రూపాయలకు చేరవచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అంతటా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం అయ్యింది.

కానీ..ఆ తర్వాత కథ మారింది. ఇరవై రోజుల్లో పెట్రోల్ ధరను లీటర్ కు నాలుగు రూపాయలు తగ్గించారు. అంతే కాదు..రాబోయే రోజుల్లో కూడా పెట్రో ధరలు తగ్గుతాయని.. పెట్రోల్ ధర లీటరకు ఐదు రూపాయలు తగ్గవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అదే జరిగితే పెట్రో భారం ప్రజల పై చాలా వరకూ తగ్గినట్టే. ఎన్నికలను లెక్కలో తీసుకుని మోడీ ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ సామాన్యుడికి ఇది ఎంతో కొంత మేలు చేసే అంశమే!