Home రాజకీయాలు కూటమిలో తీవ్రమైన లుకలుకలు..ఓడించేస్తాం!

కూటమిలో తీవ్రమైన లుకలుకలు..ఓడించేస్తాం!

SHARE

తెలంగాణలో మహాకూటమి సీట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు కానీ..విబేధాలు మాత్రం రచ్చకు ఎక్కుతున్నాయి. కూటమిలో సీట్ల పందేరం తేలక మునుపే కార్యకర్తలు మాత్రం వీధికి ఎక్కుతున్నారు. ఒక పార్టీని మరొకరు ఓడిస్తామని వీళ్లు హెచ్చరించుకంటూ ఉండటం విశేషం. అధికారికంగా సీట్లు ఖరారు కాకుండానే వీళ్లు రచ్చకు ఎక్కుతున్న వైనం రాజకీయాన్ని ఆసక్తిదాయకంగా మారుస్తోంది.

ఇప్పటికే శేరిలింగంపల్లి సీటు రచ్చ బయట పడింది. ఆ సీటు విషయంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అది తమకంటే తమకు అంటున్నారు. ఆ సీటు విషయంలో టీడీపీలోనే మరింత పోటీ ఉంది. అది వేరే సంగతి. ఒకవేళ పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి ఇస్తే తాము టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారు ఇప్పటికే ఆత్మహత్యాయత్నం వరకూ వెళ్లారు.

ఇక తాజాగా మల్కాజ్ గిరి అసెంబ్లీ సీటు విషయంలోనూ ఇదే లొల్లి. ఈ సీటును తెలంగా జనసమితికి కాంగ్రెస్ కేటాయిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ సీటు కాంగ్రెస్ దేనని.. దీన్ని టీజేఎస్ కు ఎలా ఇస్తారని వారు అంటున్నారు.
టీజేఎస్ కు ఈ సీటును ఇస్తే ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని వారు అంటున్నారు. ఇంకా అధికారికంగా ఏదీ ఖరారు కాకముందే ఇలాంటి రచ్చలు సాగుతుండటంతో..మహాకూటమి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది!