Home రాజకీయాలు ఊళ్లో పెళ్లికి చంద్రబాబు హడావుడి..ఎక్కువైంది!

ఊళ్లో పెళ్లికి చంద్రబాబు హడావుడి..ఎక్కువైంది!

SHARE

బాబు నిజంగా గెలిచే సత్తా ఉంటే.. ఫిరాయింపుదారుల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలను తీసుకురావొచ్చు. గత రెండున్నర సంవత్సరం వ్యవధిలో చాలా మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నాడు బాబు. వారంతా ప్రతిపక్ష పార్టీ తరఫున నెగ్గిన వాళ్లు. వారిపై అనర్హత వేటు పడాల్సింది. అయితే చంద్రబాబు అది జరగకుండా చూసుకొంటూ ఉన్నాడు.

ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతున్నా బాబు చలనం లేనట్టుగా ఉన్నాడు. ఫిరాయింపుదారుల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం బాబులో కనిపించడం లేదు. ఈ కథ ఇలా నడుస్తూ ఉండగా.. ఎవరో ఎక్కడోనెగ్గితే అది తన విజయం అన్నట్టుగా చంద్రబాబు నాయడు సంబరాలు చేసుకొంటూ ఉండటం గమనార్మం.

ఇది కర్ణాటక వ్యవహారం గురించి. ఇటీవలే వచ్చిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ అధికారాన్ని చేతిలోపెట్టుకున్న ఈ కూటమి విజయాన్ని సాధించగలిగింది. అందులోనూ బళ్లారిలో బీజేపీని ఈ కూటమి ఓడించడమే పెద్ద విశేషం.
ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ చాలా సంబరాలు చేసుకుంది. ఆ ఫలితాలు అలా వచ్చాయో లేదో టీడీపీ నేతలు ఇక్కడ కామెడీ మొదలుపెట్టారు. అదే అనుకుంటే.. తాజాగా చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్లాడు. జేడీఎస్ నేతలను కలిసి అభినందించి వచ్చాడు.

అదెలా ఉందంటే.. ఊళ్లో పెళ్లికి చంద్రబాబు హడావుడి చేయడం లాగుందని విశ్లేషకులు అంటున్నారు. ఎవరో గెలిస్తే తనే గెలిచాను, తనే బీజేపీని ఓడించాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నాడని.. మరీ చీప్ ట్రిక్స్ ను బాబు ఫాలో అవుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.