Home రాజకీయాలు తెలంగాణలో ఓడితే..ఏపీ టీడీపీలో కొత్త టెన్షన్!

తెలంగాణలో ఓడితే..ఏపీ టీడీపీలో కొత్త టెన్షన్!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటడం ఏమో కానీ.. అక్కడ ఏదైనా తేడా అయ్యి.. పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఓడిపోతే..అప్పుడు ఆ ప్రభావం ఏపీ పై కూడా పడుతుందేమో అని టెన్షన్ పడుతున్నారు తెలుగుదేశం నేతలు. తెలంగాణలో గెలిచినా ఒరిగేది ఏమీ లేదు కానీ.. అక్కడ మహాకూటమిలోని టీడీపీ ఓటమి పాలు అయితే..ఓవరాల్ గా తెలుగుదేశానన్ని ప్రజలు తిరస్కరించిన భావన ఏర్పడుతుందేమో అనేది టీడీపీ నేతల టెన్షన్ గా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అనవసరంగా తెలంగాణ రాజకీయాలను కెళుకుతూ తమను ఇబ్బంది పెడుతున్నాడని వారు వాపోతున్నారు.

తెలంగాణలో మహాకూటమిలో టీడీపీ యాక్టివ్ రోల్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ టీడీపీ చాలా తక్కువ సీట్లకే పరిమితం అయ్యింది. పదిహేను లోపు సీట్లకే సర్దుకుపోయింది. గత ఎన్నికల్లో ఈమాత్రం సీట్లను నెగ్గింది టీడీపీ. అయితే ఇప్పుడు ఆ మాత్రం సీట్లకే కూటమిలో చేరిపోయింది.

అలా టీడీపీ తన బలహీనతను బయటపెట్టుకుంది. ఇక మహాకూటమిగా ఏర్పడినా తెరాసను , తెరాస అధినేతను గట్టిగా ఢీ కొట్టలేకపోతోంది తెలుగుదేశం. ఈ కూటమి గెలిచి నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. తెరాస హవానే ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో..ఫలితం కేసీఆర్ కు అనుకూలంగా ఉంటే..అది టీడీపీకి ఎదురుదెబ్బే అవుతుంది.

చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకించినట్టే అవుతుంది. అదే జరిగితే.. ఏపీలో టీడీపీ వైరి పక్షానికి పండగే అవుతుంది. బాబు కథ అయిపోయింది, టీడీపీని ప్రజలు తిరస్కరించారు.. అని ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. అసలే టీడీపీపై ఏపీలో ఇప్పటికే చాలా వ్యతిరేకత పెరిగింది. అలాంటి తరుణంలో తెలంగాణలో టీడీపీ చిత్తు ఆధ్వర్యంలోని కూటమి చిత్తు అయితే.. ఆ ప్రభావం ఏపీపై మరింత పెరగవచ్చు!