Home రాజకీయాలు విజయశాంతి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా?

విజయశాంతి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా?

SHARE

కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా కాలమే అయినా.. కామ్ గానే ఉండిపోయింది విజయశాంతి. గత ఎన్నికల ముందు కేసీఆర్ తో విబేధించి కాంగ్రెస్ లో చేరిందీమె. అదే సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో విజయశాంతి కాంగ్రెస్ నుంచి గెలవొచ్చని అనుకుంది. అయితే ఈమెకు అప్పట్లో కలిసి రాలేదు.

ఎన్నికల తర్వాత కామ్ అయిపోయింది ఒకనాటి స్టార్ హీరోయిన్. తను కాంగ్రెస్ లోనే ఉన్నా లేను అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది.

అయితే ఈ మధ్యనే విజయశాంతి మళ్లీ యాక్టివ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యింది. ఆ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ అనిపించుకుంటోంది ఈ మాజీ హీరోయిన్.

ఇలాంటి నేపథ్యంలో మరో ఖబర్ ఏమిటంటే.. విజయశాంతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయనుందట. మెదక్ నుంచి ఈమె బరిలోకి దిగవచ్చని సమాచారం. అక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుందట. అయితే ఈ సీటును కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.