Home రాజకీయాలు ప్రజాస్వామ్యం గురించి పవన్..ఇది కామెడీ కదా?

ప్రజాస్వామ్యం గురించి పవన్..ఇది కామెడీ కదా?

SHARE

జనసేన అధిపతికి ఎన్నికలు దగ్గర పడుతుండే సరికి కొత్త కొత్త నీతులు గుర్తుకు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ అన్నీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే ఉంటాయనేది తెలిసిన సంగతే. ముందుగా ప్రజారాజ్యం పార్టీ రూపంలో ఎన్నికల ముందే జనం ముందుకువ చ్చాడు పీకే. ఎన్నికల తర్వాత మాయం అయ్యాడు.

పార్టీని అన్న విలీనం చేసినా పవన్ పట్టించుకోలేదు. అప్పుడంతా మీడియా ముందుకు రాలేదు. ఆ తర్వాత జనసేన అంటూ మొన్నటి ఎన్నికల ముందు జనం ముందుకు వచ్చాడు. టీడీపీ,బీజేపీలకు ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు పవన్ కల్యాణ్ ది కేవలం రాజకీయాల్లో గెస్ట్ అప్పీరియన్సే.

ఇక ఇప్పుడు ఎన్నికల దగ్గరపడుతుండటంతో పవన్ ఈ సారి సోలోగా పోటీ అంటున్నాడు. ముఖ్యమంత్రిని అయిపోతా అంటున్నాడు. కొత్త కొత్త నీతులుచెబుతున్నాడు.
ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాలేదని.. వారికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అని పీకే చెప్పుకొస్తున్నాడు. ఇదే అసలైన కామెడీ.

ఎందుకంటే.. అవతల చంద్రబాబునాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించాడు. పాతిక మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నాడు. వైసీపీ తరఫున నెగ్గిన వారిని చంద్రబాబు తన పార్టీలోకి చేర్చుకున్నాడు. వారి విషయంలో పీకే మాట్లాడటం లేదు.

చంద్రబాబు నాయుడు ఫిరాయింపులు చేయించినప్పుడు ఆయనకు మద్దతు దారుడిగానే ఉన్నాడు పవన్. అప్పుడు మారు మాట్లాడలేదు. ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు పవన్ కల్యాణ్ కు. పిరాయింపు పర్వానికి నిరసనగా వైసీపీ అసెంబ్లీకి రాకపోవడాన్ని మాత్రం పవన్ తప్పుపడుతున్నాడు. ప్రజాస్వామ్యం అంటున్నాడు. మరి ఫిరాయింపుల విషయంలో పవన్ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? రాదా?