Home రాజకీయాలు మహాకూటమి.. అదే గందరగోళం, ప్రతిష్టంభన!

మహాకూటమి.. అదే గందరగోళం, ప్రతిష్టంభన!

SHARE

తెలంగాణలో మహాకూటమిలో అదే ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. సీట్ల పందేరం ఎంతకూ తేలడం లేదు. ఉన్న సీట్లు తక్కువే.. కూటమిలోని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నది తక్కువ సీట్లనే అయినప్పటికీ.. ఈ సీట్ల పంచాయతీ మాత్రం ఎంతకూ తెగడం లేదు.

ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఒక మూలకు సర్దుకుంది. తమకు కూటమి ఏర్పాడటమే ముఖ్యమని… తక్కువ సీట్లలో పోటీ చేయడానికి కూడా టీడీపీ వెనుకాడటం లేదు. తమకు పదిహేను సీట్లు చాలని టీడీపీ మొదటి నుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగా సర్దుకుపోతోంది.

ఇక టీజేఎస్, సీపీఐలు కూడా ఎక్కువ సీట్లను ఏమీ డిమాండ్ చేయడం లేదు. సీపీఐ డిమాండ్ పదికి లోపలే కాగా.. టీజేఎస్ కూడా పదికి లోపల ఓకే అంటోంది. అయితే ఈ సీట్లను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ సై అనడం లేదు. దీంతో పంచాయితీ కొనసాగుతూ ఉంది.

కాంగ్రెస్ నుంచి తమకు ఎలాంటి స్పష్టత రాలేదని.. టీజేఎస్ కన్వీనర్ కోదండరాం అంటున్నాడు. ఇక సీపీఐ వెర్షన్ కూడా ఇలానే ఉంది. ఇక నామినేషన్ పర్వం పన్నెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయినా.. మహాకూటమిలో మాత్రం సీట్ల లెక్కలు తేలకపోవడం గమనార్హం.