Home రాజకీయాలు లోకేష్ ను ఏమనొద్దు ప్లీజ్!

లోకేష్ ను ఏమనొద్దు ప్లీజ్!

SHARE

తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అదనపు భారం మాత్రమే అనేది మొదటి నుంచి స్పష్టం అవుతున్న విషయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తన మాట తీరుతో.. పార్టీకి లోకేష్ బోలెడన్ని తలనొప్పులు తెచ్చాడు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటూ.. పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తూ లోకేష్ సాగుతూ ఉన్నాడు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తనయుడిని పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా చూపుతూనే ఉన్నాడు. అయితే లోకేష్ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి భరోసాను కల్పించలేకపోతున్నాడు.

ఇక మరోవైపు ప్రత్యర్థులు లోకేష్ ను చాలా సులువుగా టార్గెట్ చేయగలుగుతున్నారు. అటు అవినీతి వ్యవహారాల నుంచి.. ఇటు లోకేష్ మంత్రి అయిపోవడం వరకూ రకరకాల సెటైర్లు తప్పడం లేదు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రెచ్చిపోతున్నాడనే విషయం తెలిసిందే.

లోకేష్ కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా నెగ్గలేదు అని.. అయితే పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఆయన అధికారాన్ని చలామయిస్తున్నాడని పవన్ తరచూ సెటైర్లు వేస్తున్నాడు. ఈ సెటర్లకు టీడీపీ వద్ద సమాధానం లేకుండా పోయింది.

లోకేష్ ఎలా మంత్రి అయ్యాడో అందరికీ తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్సీగా లోకేష్ మంత్రి పదవిని సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటే టీడీపీ వద్ద సమాధానం లేకుండా పోయింది. లోకేష్ ను ఏమనొద్దు అని తప్ప టీడీపీ మరే సమాధానం ఇవ్వలేకపోతోంది.