Home రాజకీయాలు కాంగ్రెస్ తో పొత్తు..టీడీపీ అలా నవ్వుల పాలు!

కాంగ్రెస్ తో పొత్తు..టీడీపీ అలా నవ్వుల పాలు!

SHARE

తమ పార్టీ గనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. తాము ఉరేసుకునేందుకు కూడా వెనుకాడం అని హెచ్చరించింది వాళ్లే! తమ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిందని..అలాంటి కాంగ్రెస్ తో చేతులు కలిపే ప్రసక్తే ఉండదని చెప్పింది వాళ్లే! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను ఎన్ని మాటలు అన్నాడో..ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా తిట్టాడో అందరికీ తెలిసిన సంగతే. కొన్ని నెలల కిందటి వరకూ కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను తిడుతూ వచ్చాడు.

రాహుల్ గాంధీ ఒక మొద్దు అని.. ఇటీవల కూడా చంద్రబాబు నాయుడు తిట్టి పోశాడు. రాహుల్ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు బాబు చాలా మాటలు అన్నాడు. కాంగ్రెస్ ఏపీని నాశనం చేసిందని.. ఇప్పుడు ఏపీ ఏడుస్తుంటే చూడటానికి రాహుల్ వస్తున్నాడా అని అప్పట్లో బాబు వీరంగం ఆడాడు.
చంద్రబాబుకు ఇలాంటి వైఖరి బాగా అలవాటు అయిపోయింది. ఈ విషయంలో విమర్శలు వచ్చినా బాబు తీరు మారదు. చివరకు అదే రాహుల్ ను కలిసి నవ్వుల పాలయ్యాడు చంద్రబాబు నాయుడు.

కేవలం చంద్రబాబే కాదు.. ఈ ఎపిసోడ్లో టీడీపీ గ్యాంగ్ మొత్తం కామెడీ అయిపోయింది. ఉప ముఖ్యమంత్రి కేఈ అయితే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే తను ఉరేసుకుంటానని ప్రకటించాడు. ఇప్పుడేమో ఆయన కూడా మాట మార్చాడు. బాబు ఏ నిర్ణయం తీసుకున్నా తను కట్టుబడి ఉంటానని అన్నాడు. కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలపడం తప్పే కాదని చెబుతున్నాడు. మరి ఈ మాత్రం దానికి అప్పుడు అన్ని డైలాగులు ఎందుకు వేసినట్టో.. అని నెటిజన్లు కేఈ పై సెటైర్లు వేస్తున్నారు.