Home రాజకీయాలు విజయం వాళ్లది.. సంబరాలు టీడీపీవి!

విజయం వాళ్లది.. సంబరాలు టీడీపీవి!

SHARE

ఈ మధ్య కాలంలో ఊళ్లో పెళ్లికి హడావుడి చేయడం తెలుగుదేశం పార్టీకి బాగా అలవాటు అయ్యింది. ఎవరో ఎక్కడో ఎలాగో గెలిస్తే.. అది తమ విజయం అనేంత స్థాయిలో టీడీపీ సంబరాలు ఉంటున్నాయి. అందుకు తాజా ఉదాహరణ కర్ణాటకలో వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు.

కర్ణాటకలో జరిగిన బై పోల్స్ లో జేడీఎస్, కాంగ్రెస్ ల కూటమి పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. వివిధ స్థానాలకు జరిగిన ఈ బై పోల్స్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బళ్లారి వంటిసీటును బీజేపీ కోల్పోయింది.

దీనికి ప్రధాన కారణం కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ చేతులు కలపడం. రెండో కారణం.. ఈ కూటమి చేతిలో అధికారం ఉండటం. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి ఎదురుదెబ్బ పడింది.

ఇంకేముంది తెలుగుదేశం నేతలు తమ దైన శైలి వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. కర్ణాటకలో బీజేపీ ఓడటం పట్ల వీళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. తామే బీజేపీని ఓడించినాము అనేంత స్థాయిలో వీళ్లు మాట్లాడుతూ ఉన్నారు. అయినా టీడీపీకి ఇలాంటివి ఏమీ కొత్త కాదు కదా.

ఇక టీడీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లు గెలిచినట్టుగా.. తెలంగాణలో.. కాంగ్రెస్, టీడీపీలు గెలుస్తాయని అనేస్తున్నారు!