Home సినిమా మెగా అభిమానులకు దీపావళి కానుక

మెగా అభిమానులకు దీపావళి కానుక

SHARE

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రంగస్థలం లాంటి భారీ హిట్ తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీకి జోడిగా భరత్‌ అనేనేను ఫేం కియారా అ‍ద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ నటుడు ప్రశాంత్‌, తెలుగు హీరో ఆర్యన్‌ రాజేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. బోయపాటి మార్క్ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.