Home రాజకీయాలు ఎన్టీఆర్ బయోపిక్.. కామెడీ అయిపోతుందా?

ఎన్టీఆర్ బయోపిక్.. కామెడీ అయిపోతుందా?

SHARE

ఎన్టీఆర్ బయోపిక్ అంటే అందులో ఏముంటుంది? అంటే.. అది రెండు పార్టులుగా వస్తుందని అంటున్నారు. మొదటి పార్టులో ఎన్టీఆర్ సినిమా కెరీర్ గురించి చూపిస్తారని, రెండో పార్టులో ఎన్టీఆర్ రాజకీయం గురించి చూపిస్తారని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ రాజకీయం పార్టులో ఏముంటుంది? అంటే.. తొలి సారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం, ఆపై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు.. టీడీపీ పోరాటం వంటి అంశాలను చూపిస్తారని అంటున్నారు.

చంద్రబాబు తిరుగుబాటు , వెన్ను పోటు అంశాలు సినిమాలో ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని రెండో పార్టులో విలన్ గా చూపిస్తారని, నాదెండ్లకు కాంగ్రెస్ సహకరించడం.. ఎన్టీఆర్ రాజకీయ పోరాటాన్ని ఆ పార్టులో చూపించనున్నారని అంటున్నారు.

ఇదీ కథ అనుకుంటే.. ఇప్పుడు వర్తమానంలో అందుకు భిన్నమైన కథ నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతులు కలిపేశాడు. ఏ గాంధీల మీద అయితే టీడీపీ వాళ్లు తెగ విరుచుకుపడుతూ ఉంటారో.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాహుల్ తో చంద్రబాబు సమావేశం అయ్యాడు. తనే వెళ్లి కలిశాడు.

కాంగ్రెస్ తో దోస్తీ కట్టాడు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత దగ్గర నుంచి.. టీడీపీ కార్యకర్తల వరకూ అందరూ అందంగా సమర్థిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సినిమాలో మాత్రం కాంగ్రెస్ ను విలన్ గా చూపించడానికి మించిన కామెడీ ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనే పార్టీని పెట్టాడని సినిమాలో చూపించి.. నిజంలో మాత్రం టీడీపీ,కాంగ్రెస్ దోస్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్న సమయంలో ఆ సినిమా విడుదల అయితే అంతకు మించిన కామెడీ ఏముంటుంది?