Home ప్రత్యేకం దీపావళి రోజైనా ఈ బ్రా యాడ్స్‌ చేయకు!

దీపావళి రోజైనా ఈ బ్రా యాడ్స్‌ చేయకు!

SHARE

కనీసం ఈ దీపావళి రోజైనా బ్రా యాడ్స్‌ పోస్ట్‌ చేయవద్దని బాలీవుడ్‌ నటి దిశా పటానికి సూచిస్తున్నారు నెటిజన్లు. దీపావళి విషెస్‌ తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ చేసిన  పోస్ట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయింది. సంప్రదాయంగా చేతిలో దీపం పట్టుకోని కాల్విన్ క్లైన్ ఇండియా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ బ్రా కనిపించేలా ఉన్న ఫొటోను ఈ అమ్మడు షేర్‌ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. ‘ఏందీ ఈ నాన్సెన్స్‌.. కనీసం పండుగ రోజైన ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు’ అని ఒకరంటే.. దీపావళికైనా ఈ దుస్తుల యాడ్స్‌ ఆపేయని మరోకరు కామెంట్‌ చేశారు.

ఇలా 7 వేల కామెంట్స్‌తో చిరాకుపడ్డ దిశాపటాని సింపుల్‌గా ఆ కామెంట్స్‌ తొలగించింది. ఇక దిశా పటానిపై ట్రోల్‌ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో బికినీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అప్పట్లో ఈ అమ్మాయికి వేసుకోవడానికి దుస్తులు లేనట్టున్నాయనే కామెంట్స్‌తో నెటిజన్లు ఏకీపరేశారు.

View this post on Instagram

🎆🎆🎆🎆🎆

A post shared by disha patani (paatni) (@dishapatani) on