Home రాజకీయాలు కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు.. బీజేపీకి దెబ్బ!

కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు.. బీజేపీకి దెబ్బ!

SHARE

తమ సిట్టింగు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించేసింది భారతీయ జనతా పార్టీ. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో ఈ విధంగా బీజేపీకి దెబ్బ పడింది. అక్కడ మూడు ఎంపీ స్థానాలకు, కొన్ని అసెంబ్లీ స్థానాలకు జరిగిన బై పోల్స్ లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల కూటమి పై చేయి సాధించింది.

బీజేపీని ఓడించి ఆ కూటమి విజయ ఢంకా మోగించింది. తమ సొంత స్థానం బళ్లారిని బీజేపీ కోల్పోవడమే ఈ ఎన్నికల్లో ముఖ్యమైన పాయింట్.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొళకాల్మూరు నుంచి నెగ్గిన శ్రీరాములు బళ్లారి ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక జరిగింది.

అలాగే యడ్యూరప్పకూడా ఎమ్మెల్యేగా మిగలడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ సీటుకు, మరో ఎంపీ ఎమ్మెల్యేగా వెళ్లడంతో మండ్యా ఎంపీ సీటుకు బై పోల్ జరిగింది. అలాగే కుమారస్వామి రాజీనామా చేసిన రామనగర సీటుకు, జమఖండి అసెంబ్లీ సీటుకు బై పోల్ జరిగింది.

వీటిల్లో బళ్లారి నుంచి కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప బీజేపీ అభ్యర్థి శాంత మీద విజయం సాధించాడు. ఇక శివమొగ్గ సీటును మాత్రం బీజేపీ నిలబెట్టుకుంది.

ఆ పై మండ్యాలో జేడీఎస్ నెగ్గింది. అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా కాంగ్రెస్, జేడీఎస్ కూటమి హవా కనిపించింది. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి రామనగర నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ విధంగా ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మీద జేడీఎస్, కాంగ్రెస్ లు పై చేయి సాధించాయి.