Home ప్రత్యేకం జగన్ పై హత్యాయత్నం.. టీడీపీ సక్సెస్ అయ్యిందా!

జగన్ పై హత్యాయత్నం.. టీడీపీ సక్సెస్ అయ్యిందా!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ విజయవంతం అయ్యిందా? జగన్ ను అంతమొందించాలనే కుట్రను అమలు పరిచే విషయం ఎలా ఉన్నా.. జగన్ పై అటాక్ ను సంచలనంగా మారనీయకుండా చేయడంలో తెలుగుదేశం పార్టీ విజయవంతం అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.

గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే.. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరగడం అంటే అది ఏ మాత్రం చిన్నవిషయం కాదు. దేశంలో ఇలాంటి పరిణామాలే అరుదు. అధికారంలో ఉన్న వారి మీద అయినా హత్యాయత్నాలు జరిగాయేమో కానీ.. ఇలా ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం అంటే అది సంచలనమే. ఎందుకంటే.. అధికారంలో ఉన్న వారిని చాలా మంది టార్గెట్ చేసుకుంటారు. కానీ ప్రతిపక్షంలోని వారిని టార్గెట్ చేసుకునేది మాత్రం అధికారంలోని వారు మాత్రమే.

ఏపీలో కూడా అదే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించి కుట్రను బయటపెట్టాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఈ కుట్రను బయటపెట్టదలుచుకోలేదు. మొదటినుంచి దీన్నీ దాచేసేందుకే టీడీపీ ప్రయత్నించింది. ఇప్పటికీ అదే వైఖరిని అనుసరిస్తూ ఉంది.

జగన్ పై జరిగిన హత్యాయత్నంలో టీడీపీ నేతల ప్రమేయం గురించి వైసీపీ అనేక విషయాలను ప్రస్తావించింది. దీంతో తెలుగుదేశం కూడా వెనక్కు తగ్గింది. ఇది జగన్ మీద జగన్ చేయించుకున్న అటాక్ కాదు.. అని టీడీపీ చెబుతోంది. కానీ.. అసలు కుట్రను బయటపడనివ్వడం లేదు. మరోవైపు వైసీపీ కోడి కత్తి పార్టీ అంటూ కామెడీ చేస్తోంది టీడీపీ.

ఇవన్నీ టీడీపీ వ్యూహాత్మకం అని.. జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని దాచేసేందుకు..దాన్ని కవర్ చేసేందుకే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని.. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటించడం కూడా.. అందులో భాగమే… అని జగన్ పై హత్యాయత్నాన్ని సంచలనం కానీయకుండా జనాలను దాన్నుంచి డైవర్ట్ చేయడానికి టీడీపీ శతథా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు.