Home సినిమా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బుల్లోడుగా బాలయ్య.. బుల్లెమ్మ సావిత్రిగా నిత్యామీనన్ లుక్

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బుల్లోడుగా బాలయ్య.. బుల్లెమ్మ సావిత్రిగా నిత్యామీనన్ లుక్

SHARE

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ చకచకా షూటింగు జరుపుకుంటోంది. ‘కథానాయకుడు’ పేరుతో మొదటిభాగాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. తాజాగా సావిత్రిగా నిత్యామీనన్ లుక్ ను విడుదల చేశారు. దీపావళి కానుకగా కొంతసేపటి క్రితమే ఆమె లుక్ ను వదిలారు.

‘గుండమ్మ కథ’లో సావిత్రి పప్పు రుబ్బుతూ వుంటే ఎన్టీఆర్ వచ్చి సాయం పడతాడు. అందుకు సంబంధించిన సన్నివేశంలోని స్టిల్ ను రిలీజ్ చేశారు. లేచింది.. నిద్ర లేచింది మహిళాలోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం. బుల్లోడుగా బాలయ్య.. బుల్లెమ్మగా నిత్యామీనన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.