Home రాజకీయాలు ఒకే టికెట్.. టీడీపీ, కాంగ్రెస్ లలో మంటలు!

ఒకే టికెట్.. టీడీపీ, కాంగ్రెస్ లలో మంటలు!

SHARE

మహాకూటమిలో ఇంకా సీట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే.. నేతల మధ్యన విబేధాలు మాత్రం వీధికి ఎక్కాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డేట్ మరెంతో దూరంలో లేదు. పోలింగ్ డేట్ అయితే దగ్గరపడుతోంది. కానీ.. మహాకూటమిటో సీట్ల పందేరం మాత్రం ఇంకా సెటిల్ కాలేదు. ఇప్పటి వరకూ తాము ఫలానా సీట్ల లో పోటీ చేస్తామని మహాకూటమిలోని పార్టీలు ప్రకటించలేకపోతున్నాయి.

కానీ.. పార్టీల్లో అంతర్గతంగా మాత్రం ఇందుకు సంబంధించిన రచ్చలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకు నిదర్శనమే శేరిలింగంపల్లి సీటుకు సంబంధించిన పంచాయితీ. ఈ సీటు తమకే దక్కుతుందని తెలుగుదేవం నేతలు అంటున్నారు. ఈ కాన్ఫిడెన్స్ టీడీపీలో రచ్చ మొదలుపెడుతుండగా.. ఈ సీటు తమకు దక్కదు అనే భయం కాంగ్రస్ పార్టీలో చిచ్చును రేపుతోంది.

ఈ సీటు తమ పార్టీకే దక్కుతుందని స్వయంగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ వాళ్లకు హామీని ఇచ్చాడు. శేరిలింగంపల్లి సీటు టీడీపీకి అనుకూలమని.. అందుకే కూటమిలో ఈ సీటు తమకే దక్కుతుందని బాబు అంటున్నాడు. అంతే కాదు.. ఈ సీటు విషయంలో చంద్రబాబు నాయుడు భవ్య ఆనందప్రసాద్ కు హామీ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి.

దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని ఆనందప్రసాద్ మొదలుపెట్టాడు. ఇదే టీడీపీలో నిప్పురాజేసింది. ఈ సీటు తనకు అంటూ మొవ్వా సత్యనారాయణ మొదలుపెట్టాడు. నియోజకవర్గంలో ఆనందప్రసాద్ హడావుడిని మొవ్వా వర్గం తప్పుపడుతూ ఉంది. ఈ విబేధాలు వీధికి ఎక్కాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో లొల్లి మొదలైంది. ఈ సీటును టీడీపీకి వదలవద్దని అంటూ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ రచ్చ చేస్తున్నాడు. పీసీసీ కార్యాలయం వద్ద భిక్షపతి అనుచరులు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించారు. ఈ విధంగా ఒకే టికెట్ విషయంలో టీడీపీ, కాంగ్రెస్ లలో వేర్వేరు రచ్చలు మొదలయ్యాయి.