Home రాజకీయాలు టీడీపీతో పొత్తు.. ఏపీలో ఈ సీట్లపై కాంగ్రెస్ కన్ను!

టీడీపీతో పొత్తు.. ఏపీలో ఈ సీట్లపై కాంగ్రెస్ కన్ను!

SHARE

తెలంగాణలో కాంగ్రెస్ ,టీడీపీలు చేతులు కలిపేశాయి. ఇక ఢిల్లీ వరకూ వెళ్లి కాంగ్రెస్ యువరాజు రాహుల్ దర్శనం చేసుకున్నాడు చంద్రబాబు. ఇలా ఈ రెండు పార్టీల మధ్యనా దూరం చెరిగిపోయింది. ఈ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో ఆ పార్టీతో చేతులు కలిపాడు చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు రాజకీయ వైరాలను పెంచి పోషించిన టీడీపీ, కాంగ్రెస్ లు ఇలా చేతులు కలిపేశారు.

టీడీపీ, కాంగ్రెస్ లు తెలుగు ప్రజలను రాజకీయంగా వేరు చేశాయి. జనాలను వర్గాలుగా వేరు చేశాయి. ఈ రెండు పార్టీల మధ్యన రాజకీయ వైరంతో అనేక హత్యలు జరిగాయి. రచ్చలు కొనసాగాయి. ఇదంతా పక్కన పెట్టి.. అభిమానులను, రక్తాలను చిందించిన వారిని వెర్రి వాళ్లను చేసి.. టీడీపీ, కాంగ్రెస్ లు చేతులు కలిపాయి. ఇక ఏపీలో కూడా ఈ రెండు పార్టీలూ కలవడం ఖాయమే.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోనే మిగిలిన కొంతమంది నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా కొన్ని సీట్లను కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

కొన్నఎంపీ సీట్లకు మరి కొన్నిఎమ్మెల్యే సీట్లకు బేరం పెడుతోందట కాంగ్రెస్. నాలుగైదు ఎంపీ సీట్లు.. పదిహేను వరకూ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కోరుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగతూ ఉన్నాయట. ఈ సీట్ల కేటాయింపుకు బాబు కూడా సై అంటున్నాడు అనేది ఇన్ సైడ్ టాక్.